Suvendu Adhikari: ఢిల్లీలో బెంగాల్ రాజకీయం.. అమిత్‌షాతో సువేందు అధికారి మంత్రాంగం

బెంగాల్‌ రాజకీయాలు మరింత వేడెక్కాయి. అసెంబ్లీలో విపక్ష నేత , బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారి ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. అధిష్టానం నుంచి పిలుపు రావడంతో హుటాహుటిన హస్తిన...

Suvendu Adhikari: ఢిల్లీలో బెంగాల్ రాజకీయం.. అమిత్‌షాతో సువేందు అధికారి మంత్రాంగం
Suvendu Adhikari Meet Amit
Follow us
Sanjay Kasula

|

Updated on: Jun 08, 2021 | 9:24 PM

బెంగాల్‌ రాజకీయాలు మరింత వేడెక్కాయి. అసెంబ్లీలో విపక్ష నేత , బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారి ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. అధిష్టానం నుంచి పిలుపు రావడంతో హుటాహుటిన హస్తిన చేరుకున్నారు సువేందు . కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో అయన భేటీ అయ్యారు. బెంగాల్‌లో తాజా పరిస్థితులపై వివరించారు. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల తరువాత చెలరేగిన హింసపై అమిత్‌షాకు సువేందు అధికారి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. అసెంబ్లీలో విపక్ష నేతగా ఎన్నికైన తరువాత తొలిసారి అమిత్‌షాతో భేటీ అయ్యారు సువేందు.

ప్రధాని మోదీతో కూడా ఆయన బుధవారం భేటీ అవుతారని సమాచారం. సువేందు అధికారిపై బెంగాల్‌ పోలీసులు దొంగతనం కేసు నమోదు చేశారు. కోవిడ్‌ రిలీఫ్‌ మెటీరియల్‌ను పంచాయితీ ఆఫీస్‌ నుంచి దొంగిలించారని సువేందుతో పాటు ఆయన సోదరుడిపై కేను నమోదయ్యింది. నందిగ్రామ్‌లో సీఎం మమతా బెనర్జీని ఓడించి అసెంబ్లీకి ఎన్నికయ్యారు సువేందు అధికారి. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై అమిత్‌షాతో చర్చించినట్టు, ఆయన ఆశీస్సులు తీసుకున్నట్టు సువేందు అధికారి తెలిపారు.

మమతకు ఒకప్పుడు కుడిభుజంలా వ్యవహరించిన సువేందు అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ గూటి చేరారు. బెంగాల్‌ ప్రజలకు అన్ని విధాలా కేంద్రం నుంచి మద్దతు ఉంటుందని అమిత్‌షా భరోసా ఇచ్చారని తెలిపారు సువేందు అధికారి.

యస్‌ తుఫాన్‌ కారణంగా బెంగాల్‌లో అపారనష్టం జరిగింది. తుఫాన్‌ సహాయక చర్యలపై ప్రధాని మోదీ సమీక్షకు సీఎం మమత డుమ్మా కొట్టడంపై వివాదం కొనసాగుతోంది. ఈ అంశంపై అమిత్‌షా , సువేందు చర్చించినట్టు సమాచారం. మమత కావాలనే కేంద్రంతో కయ్యానికి కాలు దువ్వుతున్నారని ఆరోపించారు సువేందు అధికారి.

ఇవి కూడా చదవండి : Telangana: రేష‌న్ కార్డుల‌కు అప్లై చేసుకున్న‌వాళ్ల‌కు తెలంగాణ స‌ర్కార్ గుడ్ న్యూస్.. వెంట‌నే

Telangana Crime News: ప్రాణం పోసిన అమ్మే అత్యంత దారుణంగా కొట్టి ఊపిరి తీసింది.. ప‌రాయి వ్య‌క్తి మోజులో ప‌డి