AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tenth Inter exams : ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణ : నారా లోకేష్ – విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు మధ్య హై వోల్టేజ్ ఫైట్

ఆంధ్రప్రదేశ్ లో టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణ విషయంలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది...

Tenth Inter exams : ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణ : నారా లోకేష్ - విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు మధ్య హై వోల్టేజ్ ఫైట్
Nara Lokesh Vs Adimulapu
Venkata Narayana
|

Updated on: Jun 08, 2021 | 7:16 PM

Share

Nara lokesh vs AP Minister Adimulapu Suresh : ఆంధ్రప్రదేశ్ లో టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణ విషయంలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కరోనా మహమ్మారి వేళ పరీక్షలు నిర్వహించి వాళ్ల జీవితాలతో ఆటలొద్దని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరోసారి వైసీపీ సర్కారుకి విన్నవించారు. అయితే, దీనిపై మరోసారి స్పష్టత ఇచ్చారు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. ఎవరు ఎన్ని రకాల ప్రయత్నాలను చేసినా.. ప‌రీక్ష‌లు నిర్వ‌హించి తీర‌తామ‌ని స్ప‌ష్టం చేశారు. కొవిడ్ ఉద్ధృతి త‌గ్గాక ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌న్నారు. ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేయాల‌ని విద్యార్థుల త‌ల్లిదండ్రులు కోర‌డం లేద‌ని ఆయ‌న తెలిపారు. ప్ర‌తిప‌క్షాలు దీనిపై అన‌వ‌స‌ర రాద్ధాంతం చేస్తున్నాయ‌ని మంత్రి మండిప‌డ్డారు. నారా లోకేష్ కు దొరికినట్టు విదేశాల్లో చదివించడానికి అందరికీ సత్యం రామలింగరాజులు దొరకని ఆదిమూలపు సెటైర్లు వేశారు.

అయితే, లోకేష్ మాత్రం పరీక్షలు రద్దుపై విరామం లేని పోరాటం చేస్తున్నారు. ఇప్పటికే సీఎం జగన్ కు లేఖలు రాసిన ఆయన, అటు, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అభిప్రాయ సేకరణ కూడా చేశారు. న్యాయస్థానాలను ఆశ్రయించారు. అక్కడితో ఆగని ఆయన నేరుగా కేంద్రం హోం మంత్రి అమిత్ షాకు లేఖ కూడా రాశారు. ఏపీలో పరీక్షల నిర్వహణ పై జోక్యం చేసుకోవాలని లొకేష్ కోరారు. మ‌రో వైపు ఏపీలో టెన్త్ పరీక్షల నిర్వహణపై ఈ నెల 30న క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షల నిర్వహణ నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో దాఖలైన వ్యాజ్యంపై విచారణ జూన్‌ 30కి వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఆ రోజే పది పరీక్షలు జరపాలా వద్దా అనేదానిపై కోర్టు స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.

Read also : Sanjana Galrani : అన్నార్తులకు కొవిడ్ వేళ సినీనటి సంజన గల్రానీ ఆపన్నహస్తం.. దాదాపు నెల్లాళ్లుగా ఉచిత భోజన సేవ

సౌందర్య భర్త ఇప్పుడేం చేస్తున్నారంటే.. సీనియర్ హీరో..
సౌందర్య భర్త ఇప్పుడేం చేస్తున్నారంటే.. సీనియర్ హీరో..
ఒకటి కంటే ఎక్కువ PF అకౌంట్లు ఉన్నాయా? వాటిని విలీనం చేయడం ఎలా?
ఒకటి కంటే ఎక్కువ PF అకౌంట్లు ఉన్నాయా? వాటిని విలీనం చేయడం ఎలా?
తెలంగాణ TET 2026 హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్ లింక్
తెలంగాణ TET 2026 హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్ లింక్
ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.
ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.