డోర్ తెరిచిన జగన్.. బాబుకు భయం.. బీజేపీకి చెక్..!

వలసలతో ఏపీలో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఓ వైపు తమ పార్టీని బలోపేతం చేసుకునే దిశగా ఆపరేషన్ ఆకర్ష్‌ను ప్రారంభించింది బీజేపీ. ఈ నేపథ్యంలో టీడీపీలోని కీలక నేతలు చాలా మంది ఇప్పటికే కాషాయ కండువాను కప్పుకున్నారు. వారిలో ఎక్కువ శాతం టీడీపీకి చెందిన వారే ఉన్నారు. టీడీపీకి చెందిన రాజ్యసభ ఎంపీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఇప్పటికే బీజేపీలో చేరారు. అంతేకాదు ఆ పార్టీకి చెందిన మరికొందరు కూడా త్వరలోనే బీజేపీలోకి వెళ్లేందుకు సిద్ధంగా […]

డోర్ తెరిచిన జగన్.. బాబుకు భయం.. బీజేపీకి చెక్..!
Follow us

| Edited By:

Updated on: Sep 14, 2019 | 9:24 PM

వలసలతో ఏపీలో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఓ వైపు తమ పార్టీని బలోపేతం చేసుకునే దిశగా ఆపరేషన్ ఆకర్ష్‌ను ప్రారంభించింది బీజేపీ. ఈ నేపథ్యంలో టీడీపీలోని కీలక నేతలు చాలా మంది ఇప్పటికే కాషాయ కండువాను కప్పుకున్నారు. వారిలో ఎక్కువ శాతం టీడీపీకి చెందిన వారే ఉన్నారు. టీడీపీకి చెందిన రాజ్యసభ ఎంపీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఇప్పటికే బీజేపీలో చేరారు. అంతేకాదు ఆ పార్టీకి చెందిన మరికొందరు కూడా త్వరలోనే బీజేపీలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు బీజేపీకి చెక్ పెట్టేందుకు వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సిద్ధమైనట్లు రాజకీయ వర్గాల నుంచి సమాచారం.

తమ పార్టీలోకి వచ్చే వారి కోసం తాజాగా జగన్ డోర్‌ను తెరిచినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మొదటగా తోట త్రిమూర్తులు ఆ పార్టీలోకి వెళ్లబోతున్నారు. ఇవాళ టీడీపీకి రాజీనామా చేసిన తోట.. ఈ నెల 18న తాను వైసీపీలోకి వెళ్లబోతున్నట్లు ప్రకటించారు. ఇక ఆ మధ్యన టీడీపీకి రాజీనామా చేసిన ఏపీ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు సోదరుడు సన్యాసి పాత్రుడు సైతం వైసీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు అధికార పార్టీకి చెందిన కొందరు నేతలతో ఆయన సంప్రదింపులు జరుపుతున్నారని టాక్. వీరితో పాటు గతంలో వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన కొందరు నేతలు కూడా ఇప్పుడు తిరిగి సొంత గూటికి వచ్చేందుకు చూస్తున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో వారందరూ జగన్ నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నారన్నది విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక ఒక్కసారి వారికి జగన్ ఓకే చెబితే త్వరలోనే వైసీపీలోకి భారీ వలసలు ఉండబోతున్నట్లు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబుకు మరిన్ని షాక్‌లు తప్పవని వారి మాట.

అయితే తన పార్టీలోకి రావాలనుకుంటే.. వారి వారి పదవులకు రాజీనామా చేసి రావాలని గతంలో జగన్ పలుమార్లు చెప్పారు. ఈ విషయంలో తాను వెనక్కి తగ్గేది లేదని కూడా తెలిపారు. ఈ నేపథ్యంలో టీడీపీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు వైసీపీలోకి వెళ్లాలనుకున్నా.. జగన్ పెట్టిన షరతుకు భయపడి మిన్నకుండిపోయారన్నది కొందరి మాట. ఏదేమైనా వైసీపీలోకి వెళ్లే విషయంలో ప్రజా ప్రతినిధులకు మినహాయిస్తే.. మిగిలిన వారికి త్వరగానే గ్రీన్ సిగ్నల్ లభించనుందని రాజకీయ వర్గాల సమాచారం.