శామ్ పిట్రోడా నాయకత్వంలో కాంగ్రెస్ ప్రచార పర్యవేక్షణ కమిటీ

న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సన్నిహితుడు శామ్ పిట్రోడా నేతృత్వంలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కమిటీ పని చేయనున్నది. ఇటీవల ఆయన బీజేపీపై చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా భారత వైమానిక దళం పాక్ భూభాగంలోని ఉగ్ర శిబిరాలపై జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అంతేకాదు పుల్వామా ఘటన, ముంబై దాడుల విషయంలో పాకిస్థాన్‌ను తప్పుపట్టలేమని కూడా అన్నారు. దీంతో శామ్ పిడ్రోడాపై […]

  • Publish Date - 3:17 pm, Tue, 26 March 19 Edited By:
శామ్ పిట్రోడా నాయకత్వంలో కాంగ్రెస్ ప్రచార పర్యవేక్షణ కమిటీ

న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సన్నిహితుడు శామ్ పిట్రోడా నేతృత్వంలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కమిటీ పని చేయనున్నది. ఇటీవల ఆయన బీజేపీపై చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా భారత వైమానిక దళం పాక్ భూభాగంలోని ఉగ్ర శిబిరాలపై జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అంతేకాదు పుల్వామా ఘటన, ముంబై దాడుల విషయంలో పాకిస్థాన్‌ను తప్పుపట్టలేమని కూడా అన్నారు. దీంతో శామ్ పిడ్రోడాపై బీజేపీ నేతలు విరుచుకుపడ్డారు. ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ సైతం శామ్ పిట్రోడోకు ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. సర్జికల్స్ స్ట్రైక్స్ విషయంలో శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలకు రాహుల్ గాంధీ వివరణ ఇచ్చుకోవాలని బీజేపీ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శామ్ పిట్రోడాకు కాంగ్రెస్ ఎన్నికల పర్యవేక్షణ కమిటీ సారథ్య బాధ్యతలు అప్పగించడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.