ఆ రెండింటి విషయంలో టీడీపీ జోడెద్దుల బండిలాంటిది: లోకేష్

సంక్షేమం, అభివృద్ధి టీడీపీకి జోడెద్దుల బండిలాంటిదన్నారు ఏపీ మంత్రి నారా లోకేష్. శ్రీకాకుళం జిల్లా పలాసలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉన్నా.. ప్రజలకు ఎలాంటి లోటు లేకుండా సీఎం చంద్రబాబు పాలన సాగుతోందన్నారు. ప్రత్యేక హోదాపై నమ్మించి మోసం చేశారంటూ కేంద్రంపై మండిపడ్డారు లోకేష్. చంద్రబాబు పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. అదే.. జగన్ ప్రభుత్వం వస్తే ప్రజల్లో ఉన్న సంతోషం కూడా పోతుందని ఎద్దేవా చేశారు. మంగళగిరిలో […]

  • Updated On - 3:04 pm, Tue, 26 March 19 Edited By:
ఆ రెండింటి విషయంలో టీడీపీ జోడెద్దుల బండిలాంటిది: లోకేష్

సంక్షేమం, అభివృద్ధి టీడీపీకి జోడెద్దుల బండిలాంటిదన్నారు ఏపీ మంత్రి నారా లోకేష్. శ్రీకాకుళం జిల్లా పలాసలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉన్నా.. ప్రజలకు ఎలాంటి లోటు లేకుండా సీఎం చంద్రబాబు పాలన సాగుతోందన్నారు. ప్రత్యేక హోదాపై నమ్మించి మోసం చేశారంటూ కేంద్రంపై మండిపడ్డారు లోకేష్. చంద్రబాబు పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. అదే.. జగన్ ప్రభుత్వం వస్తే ప్రజల్లో ఉన్న సంతోషం కూడా పోతుందని ఎద్దేవా చేశారు. మంగళగిరిలో కూడా ఐటీ పరంగా చాలా ప్రాజెక్టులు వచ్చాయని అన్నారు. పథకాల విషయంలో కూడా ఏపీ నెంబర్ 1 స్థానంలో ఉందన్నారు లోకేష్. ఏపీలోని పథకాలనే పక్క రాష్ట్రం కాపీ కొడుతుందని అన్నారు. కావాలనే కొంతమంది కుట్రలు చేస్తున్నారని.. అవేమీ ప్రజలు పట్టించుకోరని అన్నారు. ఈ సారి కూడా తెలుగుదేశం పార్టీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు మంత్రి నారా లోకేష్.