బీజేపీ గూటికి చేరిన అల‌నాటి తార

న్యూఢిల్లీ : ఒక‌ప్ప‌టి అందాల తార జ‌య‌ప్ర‌ద బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. గ‌తంలో ప‌లు పార్టీల‌కి పని చేసిన జ‌య‌ప్ర‌ద ఎంపీగా కూడా ప‌ని చేశారు. తాజాగా ఆమె కాషాయ కండువా క‌ప్పుకున్నారు. ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని రామ్‌పుర్ నియోజ‌క వ‌ర్గం నుంచి ఆమె పోటీ చేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది. కాగా రాంపూర్ నియోజకవర్గం నుంచి సమాజ్ వాదీ పార్టీ నుంచి ఆజంఖాన్‌పై జయప్రదను బీజేపీ బరిలో దింపే అవకాశం ఉంది. ఈ రాంపూర్ నుంచి 2014లో బీజేపీ అభ్యర్థి […]

  • Publish Date - 1:46 pm, Tue, 26 March 19 Edited By:
బీజేపీ గూటికి చేరిన అల‌నాటి తార

న్యూఢిల్లీ : ఒక‌ప్ప‌టి అందాల తార జ‌య‌ప్ర‌ద బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. గ‌తంలో ప‌లు పార్టీల‌కి పని చేసిన జ‌య‌ప్ర‌ద ఎంపీగా కూడా ప‌ని చేశారు. తాజాగా ఆమె కాషాయ కండువా క‌ప్పుకున్నారు. ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని రామ్‌పుర్ నియోజ‌క వ‌ర్గం నుంచి ఆమె పోటీ చేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది. కాగా రాంపూర్ నియోజకవర్గం నుంచి సమాజ్ వాదీ పార్టీ నుంచి ఆజంఖాన్‌పై జయప్రదను బీజేపీ బరిలో దింపే అవకాశం ఉంది. ఈ రాంపూర్ నుంచి 2014లో బీజేపీ అభ్యర్థి డాక్టర్ నేపాల్ సింగ్ విజయం సాధించారు. 2004 నుంచి 2014 వరకు ఇదే నియోజకవర్గం నుంచి ఎస్పీ తరపున జయప్రద ఎంపీగా కొనసాగారు. ఇప్పుడీ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఆజంఖాన్‌పై గతంలో జయప్రద ఘాటైన వ్యాఖ్యలు కూడా చేశారు. ఆజంఖాన్‌ను చూస్తుంటే అల్లావుద్దీన్ ఖిల్జీ గుర్తొస్తున్నాడని ఆమె చేసిన వ్యాఖ్యలు అప్పట్లో రాజకీయ దుమారం లేపాయి. మొత్తానికి జయప్రద చేరికతో రాంపూర్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి.