వైసీపీలో చేరిన నటుడు మోహన్ బాబు

ప్రముఖ నటుడు మోహన్ బాబు, ఆయన తనయుడు మంచు విష్ణు వైసీపీలో చేరారు. లోటస్ పాండ్‌లో వైఎస్ జగన్‌ను కలిసారు మోహన్ బాబు, విష్ణు.  అనంతరం.. మోహన్ బాబుకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు జగన్. ఈ సందర్భంగా.. నటుడు మోహన్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. పదవి ఆశించి తను వైసీపీలో చేరలేదన్నారు. తెలుగు ప్రజల మంచి కోసమే పార్టీలో చేరానని స్పష్టం చేశారు. జగన్ ముఖ్యమంత్రి అయితే ఏపీకి మంచి జరుగుతుందన్నారు. ఇప్పటికి చాలా సార్లు […]

  • Updated On - 2:42 pm, Tue, 26 March 19 Edited By:
వైసీపీలో చేరిన నటుడు మోహన్ బాబు

ప్రముఖ నటుడు మోహన్ బాబు, ఆయన తనయుడు మంచు విష్ణు వైసీపీలో చేరారు. లోటస్ పాండ్‌లో వైఎస్ జగన్‌ను కలిసారు మోహన్ బాబు, విష్ణు.  అనంతరం.. మోహన్ బాబుకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు జగన్. ఈ సందర్భంగా.. నటుడు మోహన్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. పదవి ఆశించి తను వైసీపీలో చేరలేదన్నారు. తెలుగు ప్రజల మంచి కోసమే పార్టీలో చేరానని స్పష్టం చేశారు. జగన్ ముఖ్యమంత్రి అయితే ఏపీకి మంచి జరుగుతుందన్నారు. ఇప్పటికి చాలా సార్లు కాలేజీ ఫీజు రీయంబర్స్ మెంట్‌ విషయంపై చంద్రబాబుతో మాట్లాడానని తెలిపారు. ఇప్పటివరకు రూ.19కోట్లు బకాయిలు రావాలని..  అయినా ఆయన స్పందించకపోవడంతోనే తిరుపతిలో ధర్నా చేశానని చెప్పారు.