ప్రత్యేక హోదా పోరాటం ఘనత జగన్‌దే: వాసిరెడ్డి పద్మ

హైదరాబాద్: ప్రత్యేక హోదా కోసం పోరాడిన ఘనత జగన్‌దేనని అన్నారు వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ. జగన్ పోరాటానికి భయపడిన చంద్రబాబు యూ టర్న్ తీసుకున్నారని విమర్శించారు. కేంద్రానికి చంద్రబాబు పిరికిపందలా భయపడితే, జగన్ ధైర్యంతో పారాడారని ఆమె గుర్తు చేశారు. చంద్రబాబు గారికి సరిగ్గా ఎన్నికల ముందే పౌరుషం పొడుచుకొస్తుందని, ఎన్నికల ముందు డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. ఏపీ ప్రజలు రెచ్చిపోయి తిరగబడాలన్న విధంగా మాట్లాడుతున్నారు, మరి రాష్ట్ర విభజన లేఖపై చంద్రబాబు ఎందుకు […]

ప్రత్యేక హోదా పోరాటం ఘనత జగన్‌దే: వాసిరెడ్డి పద్మ
Follow us

|

Updated on: Mar 26, 2019 | 3:36 PM

హైదరాబాద్: ప్రత్యేక హోదా కోసం పోరాడిన ఘనత జగన్‌దేనని అన్నారు వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ. జగన్ పోరాటానికి భయపడిన చంద్రబాబు యూ టర్న్ తీసుకున్నారని విమర్శించారు. కేంద్రానికి చంద్రబాబు పిరికిపందలా భయపడితే, జగన్ ధైర్యంతో పారాడారని ఆమె గుర్తు చేశారు. చంద్రబాబు గారికి సరిగ్గా ఎన్నికల ముందే పౌరుషం పొడుచుకొస్తుందని, ఎన్నికల ముందు డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. ఏపీ ప్రజలు రెచ్చిపోయి తిరగబడాలన్న విధంగా మాట్లాడుతున్నారు, మరి రాష్ట్ర విభజన లేఖపై చంద్రబాబు ఎందుకు సంతకం చేశారని ప్రశ్నించారు.

ఒక పిరికి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటం వల్లనే ఏపీకి ప్రత్యేక హోదా రాలేదని విమర్శించారు. జగన్‌ను చూసి చంద్రబాబు భయపడుతున్నారు. కేసీఆర్‌పై ఇప్పుడు రోషం చూపిస్తున్న చంద్రబాబు అంతకుముందు కేసీఆర్‌తోనే కలిసిమెలిసి ఉన్నారని, ఆంధ్రా రుచులన్నీ చూపించి భోజనం పెట్టారని మండిపడ్డారు. తెలంగాణలో ప్రాజెక్టులు కట్టి దిగువన ఉన్న ఏపీకి నీళ్లు రాకుండా ఉండే ప్రయత్నం జరిగినప్పుడు కేసీఆర్‌ను చంద్రబాబు ఎందుకు ప్రశ్నించలేదని చంద్రబాబును వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు.