రైతులంటే ప్రధాని మోదీకి చాలా ద్వేషం, అవకాశం వస్తే గోవర్థనగిరి పర్వతం కూడా అమ్మేస్తారు : ప్రియాంక గాంధీ

ఉత్తరప్రదేశ్‌ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలను ఉధృతం చేశారు కాంగ్రెస్ పార్టీ కీలకనేత ప్రియాంకాగాంధీ. మథురలో కాంగ్రెస్‌ నిర్వహించిన కిసాన్‌..

  • Venkata Narayana
  • Publish Date - 4:20 pm, Tue, 23 February 21
రైతులంటే ప్రధాని మోదీకి చాలా ద్వేషం, అవకాశం వస్తే గోవర్థనగిరి పర్వతం కూడా అమ్మేస్తారు : ప్రియాంక గాంధీ

ఉత్తరప్రదేశ్‌ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలను ఉధృతం చేశారు కాంగ్రెస్ పార్టీ కీలకనేత ప్రియాంకాగాంధీ. మథురలో కాంగ్రెస్‌ నిర్వహించిన కిసాన్‌ పంచాయత్‌కు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె, బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రైతులంటే ప్రధాని మోదీకి చాలా ద్వేషమని విమర్శించారు. దేశాన్ని అమ్మేయడమే బీజేపీ పనిగా పెట్టుకుందని మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్‌లో ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం తప్ప ఇంకేమి లేదని ఆరోపించారు ప్రియాంక. ఎల్‌ఐసీ, బీపీసీఎల్‌ లాంటి సంస్థలను కేంద్రం అమ్మేస్తోంది.. అవకాశం వస్తే బీజేపీ గోవర్ధనగిరి పర్వతాన్ని కూడా అమ్మేస్తుందని ఘాటుగా విమర్శించారు ప్రియాంకగాంధీ.

Read also :

కవితని పర్సనల్‌ టార్గెట్ చేసిన తరుణ్ చుగ్, సీబీఐ ఎంక్వైరీ కోరతామన్న టీబీజేపీ ఇంచార్జి, మండిపడుతున్న గులాబీదళం