కంటతడి పెట్టుకున్న పొంగులేటి

ఖమ్మం: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కంటతడి పెట్టుకున్నారు. టీఆర్ఎస్ నుంచి ఖమ్మం పార్టమెంటు సీటు దక్కకపోవడంతో నిరాశకు గురయ్యారు. హైదరాబాద్ నుంచి వచ్చిన పొంగులేటి నివాసానికి  కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆయన తరలి వచ్చారు. పొంగులేటి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగాలని వారంతా పొంగులేటిని కోరారు. ఈ సందర్భంగా కార్యకర్తలు ఎమోషన్‌కి గురి కావడంతో ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. కార్యకర్తలను ఆలింగనం చేసుకుని కంటతడిపెట్టారు. సిట్టింగ్ ఎంపీగా ఉన్న […]

  • Ram Naramaneni
  • Publish Date - 4:25 pm, Sun, 24 March 19
కంటతడి పెట్టుకున్న పొంగులేటి

ఖమ్మం: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కంటతడి పెట్టుకున్నారు. టీఆర్ఎస్ నుంచి ఖమ్మం పార్టమెంటు సీటు దక్కకపోవడంతో నిరాశకు గురయ్యారు. హైదరాబాద్ నుంచి వచ్చిన పొంగులేటి నివాసానికి  కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆయన తరలి వచ్చారు. పొంగులేటి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగాలని వారంతా పొంగులేటిని కోరారు. ఈ సందర్భంగా కార్యకర్తలు ఎమోషన్‌కి గురి కావడంతో ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. కార్యకర్తలను ఆలింగనం చేసుకుని కంటతడిపెట్టారు.

సిట్టింగ్ ఎంపీగా ఉన్న పొంగులేటికి సీటివ్వకపోవడంతో ఆయన అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్‌కు సంబంధించి  నామా నాగేశ్వరరావుకు సీటివ్వడంతో పొంగులేటికి ఆ సీటు దక్కలేదు. కొద్దిరోజుల క్రితమే నామా నాగేశ్వరరావు టీడీపీ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్‌లో చేరారు.