రాబోయేది మళ్లీ మోదీ సర్కారే : నిర్మళా సీతారామన్‌

హైదరాబాద్ : కేంద్రంలో నరేంద్రమోదీ నేతృత్వంలో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ ధీమా వ్యక్తంచేశారు. హైదరాబాద్‌లోని సైనిక్‌పురిలో భాజపా ఆధ్వర్యంలో ఎక్స్‌ సర్వీస్‌మెన్లు, మేధావులతో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీతారామన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీజేపీ నేతలు లక్ష్మణ్‌, రామచంద్రరావు, ఎన్వీఎస్‌ ప్రభాకర్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతారామన్‌ మాట్లాడుతూ.. దేశ రక్షణ, అభివృద్ధి కోసం మోదీ ప్రభుత్వం మరోసారి ఏర్పాటు కావాల్సిన అవసరం […]

రాబోయేది మళ్లీ మోదీ సర్కారే : నిర్మళా సీతారామన్‌
Follow us

| Edited By:

Updated on: Mar 24, 2019 | 2:08 PM

హైదరాబాద్ : కేంద్రంలో నరేంద్రమోదీ నేతృత్వంలో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ ధీమా వ్యక్తంచేశారు. హైదరాబాద్‌లోని సైనిక్‌పురిలో భాజపా ఆధ్వర్యంలో ఎక్స్‌ సర్వీస్‌మెన్లు, మేధావులతో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీతారామన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీజేపీ నేతలు లక్ష్మణ్‌, రామచంద్రరావు, ఎన్వీఎస్‌ ప్రభాకర్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతారామన్‌ మాట్లాడుతూ.. దేశ రక్షణ, అభివృద్ధి కోసం మోదీ ప్రభుత్వం మరోసారి ఏర్పాటు కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. బీజేపీకి ప్రజలు మద్దతు తెలపాలని కోరారు. స్వార్థం లేకుండా ప్రతి ఒక్కరి బాగు కోసం పనిచేసే మోదీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి రామచంద్రరావును గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.