శబరిమల ఆలయ బంగారు చోరీ కేసులో కొత్త మలుపు చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడు ఉన్ని కృష్ణన్ పొట్టితో సంబంధాల ఆరోపణల నేపథ్యంలో ప్రముఖ నటుడు జయరాంను సిట్ అధికారులు చెన్నైలోని ఆయన నివాసంలో విచారించారు. ఉన్ని కృష్ణన్ నిర్వహించిన పూజల్లో జయరాం పాల్గొన్న వీడియోలు వెలుగులోకి రావడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది.