మోమోస్ షాపులో అగ్నిప్రమాదం.. 21 మంది మృతి
కోల్‌కతాలోని ఆనంద్‌పూర్ ప్రాంతంలో జనవరి 26న రెండు ఆహార గోదాంలలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మోమోస్ తయారీకి సంబంధించిన ఈ గోదాంలలో మంటలు వేగంగా వ్యాపించాయి. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 21 మంది మృతి చెందగా, మరో 28 మంది ఆచూకీ ఇంకా తెలియలేదు. పొడి ఆహార పదార్థాలు, మండే వస్తువుల వల్ల ప్రమాద తీవ్రత పెరిగింది. ఇది గణతంత్ర దినోత్సవం రోజున విషాదాన్ని నింపింది.
మోమో ఆహార పదార్థాల గోదాంలో అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదంలో మృతుల సంఖ్య 21కి చేరింది. మరో 28 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. అసలు ఏం జరిగిందంటే.. జనవరి 26న గణతంత్ర దినోత్సవం వేళ కోల్‌కతాలో జరిగిన భారీ అగ్నిప్రమాదం ఘోర విషాదాన్ని మిగిల్చింది. సోమవారం ఉదయం 3 గంటలకు ఆనంద్‌పూర్ ప్రాంతంలోని రెండు ఆహార గోదాంలలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు. అయితే గోదాం లోపల పొడి ఆహార పదార్థాలతో పాటూ మండే వస్తువులు అధికంగా ఉండడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. గంటల తరబడి ఫైర్ సిబ్బంది ప్రయత్నం చేసినా మంటలు అదుపులోకి రాలేదు. చాలా సమయం తర్వాత అగ్నిమాపక సిబ్బంది అందులో చిక్కుకున్న వారి కోసం గాలింపులు చేపట్టగా తొలి రోజు 16 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Gold Price: పసిడి పరుగులకు బ్రేక్.. ఒక్క రోజులోనే భారీ క్షీణత
Economic Survey 2026: దేశం 20 ఏళ్ల వెనక్కెళ్తుందా ?? ఆర్థిక సర్వేలో షాకింగ్ నిజాలు
కలచివేస్తున్న నాంపల్లి అగ్నిప్రమాద బాధితుల ఆఖరి ఆడియో
Harish Rao: ఢిల్లీ మీటింగ్‌ను బహిష్కరించండి.. హరీష్ రావు డిమాండ్
కొబ్బరిచెట్టుపై కాయలు కోస్తున్న కోతి.. నెట్టింట వీడియో వైరల్
కొవిడ్ తరహా స్క్రీనింగ్.. ఆ ఎయిర్పోర్టుల్లో మళ్ళీ మొదలు
పనిచేస్తున్న ఇంట్లోనే చోరీ.. రూ.18 కోట్ల బంగారం దోచుకెళ్లారు
పోలీసులమంటూ బంగారం దోపిడి.. పాలమూరులో నయా ముఠా
ఏనుగు పిల్లకు పుట్టినరోజు వేడుక.. అదరగొట్టారుగా
రైల్వే స్టేషన్లో గుండె పగిలే ఘటన..
ఓర్నీ.. మటన్ బొక్క ఎంతపని చేసిందీ

