AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2026 Speech Live: మీ అరచేతిలో బడ్జెట్‌-2026 అప్‌డేట్స్.. ఇలా లైవ్ స్ట్రీమింగ్ చూడండి..!

బడ్జెట్‌ వస్తున్న ప్రతీసారి "నాకేంటి లాభం" అని సామాన్యులు ఎదురు చూస్తుంటారు. ట్యాక్స్‌ రిలీఫ్‌లు ఉంటాయా? నిత్యవసర ధరల పెరుగుదలపై ప్రభావమెంతా..? ఏయే రంగాలకు ఉపశమనం కలుగుతుంది. ఏ రంగాలపై బాదుడు తప్పదు అన్న ఆసక్తి ఉంటుంది. ఈసారి ద్రవ్యోల్బణం నుండి ఉపశమనం లభిస్తుందా లేదా జేబుపై భారం పెరుగుతుందా? టీవీ లైవ్ ద్వారా బడ్జెట్ అప్‌డేట్స్ తెలుసుకోండి..

Budget 2026 Speech Live: మీ అరచేతిలో బడ్జెట్‌-2026 అప్‌డేట్స్.. ఇలా లైవ్ స్ట్రీమింగ్ చూడండి..!
Budget 2026 Speech Live Streaming
Balaraju Goud
| Edited By: |

Updated on: Jan 30, 2026 | 3:26 PM

Share

బడ్జెట్‌ వస్తున్న ప్రతీసారి “నాకేంటి లాభం” అని సామాన్యులు ఎదురు చూస్తుంటారు. ట్యాక్స్‌ రిలీఫ్‌లు ఉంటాయా? నిత్యవసర ధరల పెరుగుదలపై ప్రభావమెంతా..? ఏయే రంగాలకు ఉపశమనం కలుగుతుంది. ఏ రంగాలపై బాదుడు తప్పదు అన్న ఆసక్తి ఉంటుంది. ఈసారి ద్రవ్యోల్బణం నుండి ఉపశమనం లభిస్తుందా లేదా జేబుపై భారం పెరుగుతుందా? అనేదానిపై దేశ వ్యాప్తంగా  బడ్జెట్ ప్రసంగం కోసం ఎదురు చూస్తంటారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 1, 2026న ప్రవేశపెట్టనున్న బడ్జెట్ 2026పై అందరి దృష్టి నెలకొంది.

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, ఉదయం 11 గంటలకు పార్లమెంటులో తన ప్రసంగాన్ని ప్రారంభిస్తారు. ఈ సారి బడ్జెట్‌పై సామాన్యుల నుంచి వ్యాపారవేత్తల వరకు అందరూ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇటీవలే జీఎస్టీని కేంద్రం తగ్గించడంతో .. ఇప్పుడు బడ్జెట్‌లోనూ ఊరటనిచ్చే అంశాలు ఉంటాయని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో ఫిబ్రవరి చివరి రోజున బడ్జెట్ ప్రవేశపెట్టారు. కానీ అరుణ్ జైట్లీ ఆ సంప్రదాయాన్ని మార్చి ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టారు. అప్పటినుంచి ప్రతిఏటా ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. కానీ ఈసారి దేశచరిత్రలో తొలిసారిగా ఆదివారం నాడు ప్రవేశపెడుతుండడం గమనార్హం. బడ్జెట్ రోజున టీవీలో ప్రత్యక్ష ప్రసారం చూడలేకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ మొబైల్ ఫోన్‌లోనే బడ్జెట్‌ను ప్రత్యక్షంగా చూడొచ్చు.

మీరు నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టే బడ్జెట్‌ను ప్రత్యక్షంగా వీక్షించాలనుకుంటే..  TV9 తెలుగు యూట్యూబ్ ఛానెల్‌లో ప్రత్యక్షంగా చూడొచ్చు. ఇంకా TV9 తెలుగు వెబ్‌సైట్‌లోనూ మినట్ టు మినట్ అప్‌డేట్స్ తెలుసుకోవచ్చు. బడ్జెట్ ప్రసంగం దాదాపు 60 నుండి 90 నిమిషాల వరకు ఉంటుందని భావిస్తున్నారు.

టీవీ 9 తెలుగు లైవ్ లింక్.. కోసం ఇక్కడ క్లిక్ చేయండి

టీవీ 9 తెలుగు వెబ్‌సైట్ బడ్జెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బడ్జెట్ కాపీని ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం పూర్తయిన వెంటనే ప్రభుత్వం బడ్జెట్‌ను డిజిటల్ ఫార్మాట్‌లో అందుబాటులో ఉంచుతుంది. మీరు అధికారిక వెబ్‌సైట్ indiabudget.gov.in ని సందర్శించి బడ్జెట్‌ కాపీలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్‌లో PDF ఫార్మాట్‌లో బడ్జెట్ కాపీలు అందుబాటులో ఉంటాయి. బడ్జెట్‌కు ముందు, జనవరి 29న పార్లమెంటులో 2026-27 ఆర్థిక సర్వేను సమర్పించారు. ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక వ్యవహారాల శాఖ ఆర్థిక విభాగం రూపొందించిన ఈ సర్వే 2025-26లో ఆర్థిక పనితీరును సమీక్షిస్తుంది.తదుపరి ఆర్థిక సంవత్సరానికి ఒక అంచనాను అందిస్తుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..