AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: నారు చూసేందుకు ఉదయాన్నే పొలానికి వెళ్లిన రైతు.. అక్కడ కనిపించింది చూసి..

రాత్రి బాగా వర్షం కురసింది.. పొలం దగ్గర వేసిన నారుముడి ఎలా ఉందో చూద్దామని రైతు ఉదయాన్నే ఆతృతగా పొలం వద్దకు వెళ్లాడు.. నారుముడి దగ్గరకు చేరుకున్నాడు.. ఇంతలో కళ్ల ముందే ఆవిష్కృతమైన అరుదైన ప్రకృతి విన్యాసం అతన్ని కట్టి పడేసింది. అక్కడ రెండు నాగు పాములు నృత్యం చేస్తూ కనిపించాయి. అది చూసి తొలుత భయపడిన రైతు కాస్త దూరంగా వెల్లి అరుదైన దృశ్యాన్ని ఫోన్‌లో రికార్డ్ చేసి సోసల్‌ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. ఇది కాస్తా ఇప్పుడు వైరల్‌గా మారింది.

Viral Video: నారు చూసేందుకు ఉదయాన్నే పొలానికి వెళ్లిన రైతు.. అక్కడ కనిపించింది చూసి..
Paddy Field Cobras
G Sampath Kumar
| Edited By: |

Updated on: Jun 14, 2026 | 10:22 AM

Share

ఉదయం పొలానికి వెళ్లిన రైతుకు ఊహించని పరిణామం ఎదురైంది. నారుమడి పక్కనే రెండు పాములు నృత్యం చేస్తున్న దృశ్యం అతన్ని కట్టి పడేసింది. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం చిన్నపాపయ్యపల్లె గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు తనుగుల సంపత్ నారుమడికి నీరు పెట్టేందుకు వెళ్లగా, రెండు పాములు ఒకదానికొకటి పెనవేసుకుని గాలిలో నాట్యం చేస్తున్నట్టుగా సయ్యాటలు ఆడుతూ కనిపించాయి. భూమి నుంచి పైకి లేస్తూ, మెలికలు తిరుగుతూ, ఒకదానిని మరొకటి చుట్టేసుకుంటూ సాగిన ఆ విన్యాసం రైతుకు ఓవైపు భయం మరోవైపు అబ్బురపరిచింది.

నారుమడి మధ్యలో ప్రారంభమైన ఈ నాగసయ్యాట క్రమంగా రోడ్డుపైకి చేరి దాదాపు పది అడుగుల మేర కొనసాగింది. సుమారు 30 నిమిషాల పాటు ఎలాంటి భయం లేకుండా, చుట్టుపక్కల పరిస్థితులను పట్టించుకోకుండా ఆ రెండు పాములు తమ సహజ విన్యాసాన్ని ప్రదర్శించాయి. ఈ అరుదైన దృశ్యాన్ని రైతు సంపత్ తన మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించగా, ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వన్యప్రాణి నిపుణుల అభిప్రాయం ప్రకారం, వర్షాకాలం ప్రారంభంలో పాముల సంచారం పెరుగుతుందని, జతకట్టే సమయంలో లేదా ఆధిపత్య పోరాటంలో భాగంగా ఇలాంటి సయ్యాటలు కనిపించే అవకాశముందని చెబుతున్నారు. అయితే సాధారణ ప్రజలకు ఇలాంటి దృశ్యాలు చాలా అరుదుగా కనిపిస్తాయని పేర్కొంటున్నారు. ప్రకృతి తన అందాలను, రహస్యాలను ఇలా అప్పుడప్పుడూ ఆవిష్కరిస్తూ అందరినీ మైమరపింపజేస్తున్నాయి.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us