AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మేడారం జాతరలో డిజిపి పర్యటన.. గవర్నర్, మంత్రి సీతక్క లతో దర్శనం

మేడారం జాతరలో డిజిపి పర్యటన.. గవర్నర్, మంత్రి సీతక్క లతో దర్శనం

Vijay Saatha
| Edited By: |

Updated on: Jan 30, 2026 | 10:19 PM

Share

మేడారం జాతరలో భద్రతా ఏర్పాట్లను డీజీపీ స్వయంగా పర్యవేక్షించారు. 'మేడారం 2.0' కింద AI డ్రోన్లు, ఫేషియల్ రికగ్నిషన్, QR కోడ్ రిస్ట్ బ్యాండ్స్ వంటి అధునాతన సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. 13 వేల మంది పోలీసులు, 450 సీసీటీవీలు, 37 పార్కింగ్ ప్రదేశాలు, 3800 ఆర్టీసీ బస్సులతో భక్తుల భద్రత, సౌకర్యాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇది జాతర చరిత్రలో విప్లవాత్మక మార్పు.

మేడారం లోని అడవి తల్లులు సమ్మక్క-సారలమ్మల మహాజాతరలో అత్యంత కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. భక్తజనసందోహం పోటెత్తిన వేళ.. క్షేత్రస్థాయిలో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ శ్రీ బి.శివధర్ రెడ్డి శుక్రవారం మేడారంలో పర్యటించారు. ఈ సందర్భంగా హెలికాప్టర్‌లో విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు రాష్ట్ర మంత్రి సీతక్కతో కలిసి దర్శనం చేసుకున్నారు. అంతకుముందు, గద్దెల వద్దకు చేరుకున్న డిజిపి వనదేవతలను దర్శించుకుని మొక్కుల రూపంలో ‘నిలువెత్తు బంగారం’ (బెల్లం) సమర్పించుకున్నారు. జాతరలో రద్దీ పెరిగిన నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ యంత్రాంగం తీసుకుంటున్న చర్యలను ఆయన స్వయంగా పరిశీలించారు.ఈ సందర్భంగా తనను కలిసిన మీడియాతో డిజిపి మాట్లాడుతూ. జాతర చరిత్రలో తొలిసారిగా ప్రవేశపెట్టిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం భద్రతలో కీలక మార్పులు తీసుకొచ్చిందని వివరించారు. ‘మేడారం 2.0’ పేరుతో అమలు చేస్తున్న ‘టీజీ-క్వెస్ట్’ కృత్రిమ మేధ ఆధారిత డ్రోన్ పోలీసింగ్ వ్యవస్థ ద్వారా సుమారు 30 చదరపు కిలోమీటర్ల మేర ప్రతి అంగుళాన్ని నిశితంగా గమనిస్తున్నామన్నారు. ఈ డ్రోన్లు ‘డిజిటల్ బీట్ ఆఫీసర్లు’గా వ్యవహరిస్తూ అటవీ ప్రాంతం, జంపన్న వాగు వంటి ప్రదేశాల నుంచి ఎప్పటికప్పుడు ప్రత్యక్ష సమాచారాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా జనసందడిలో పిల్లలు తప్పిపోకుండా ఉండేందుకు ప్రవేశపెట్టిన క్యూఆర్ కోడ్ రిస్ట్ బ్యాండ్లు మంచి ఫలితాలనిస్తున్నాయని, పాత నేరస్తులను గుర్తించేందుకు ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్, అనుమానాస్పద వస్తువులను పసిగట్టేందుకు ఏఐ అలర్ట్స్ వాడుతున్నామని ఆయన పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం సుమారు 13 వేల మందికి పైగా పోలీస్ సిబ్బంది ఏడు రోజుల పాటు నిరంతరం విధుల్లో ఉంటారని డిజిపి వెల్లడించారు. వాహనాల రాకపోకలకు ఆటంకం కలగకుండా 2000 ఎకరాల్లో 37 పార్కింగ్ ప్రదేశాలను సిద్ధం చేసి, వాటిని ఏఎన్పీఆర్ నిఘా వ్యవస్థతో అనుసంధానించామన్నారు. దాదాపు 450 సీసీటీవీల ద్వారా జాతరలోని ప్రతి కదలికను హైదరాబాద్‌లోని రాష్ట్ర కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. భక్తుల సౌకర్యార్థం 3800 ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయని, జాతరలో ఎక్కడ ఏ సమస్య ఎదురైనా తక్షణమే స్పందించేలా 24 గంటల పాటు పోలీస్ హెల్ప్ డెస్కులు అందుబాటులో ఉన్నాయని డిజిపి వివరించారు. ఈ పర్యటనలో మల్టీ జోన్-1 ఐజీ ఎస్.చంద్రశేఖర్ రెడ్డి, ములుగు ఎస్పీ కేకన్ సుధీర్ రామ్ నాథ్, మేడారం బందోబస్తు కోసం వచ్చిన ఐపిఎస్ అధికారులు డిజిపి వెంట ఉన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TTD: టీటీడీ శ్రీవారి డాలర్లకు ఫుల్ డిమాండ్

జగన్‌ను దెబ్బతీయటానికే లడ్డూ వివాదం లేపారు

కాక్‌పిట్‌లో హాహాకారాలు దొరికిన బ్లాక్‌బాక్స్‌.. ఆఖరి 11 నిమిషాల గుట్టు రట్టు ?

మోమోస్‌ షాపులో అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

Gold Price: పసిడి పరుగులకు బ్రేక్.. ఒక్క రోజులోనే భారీ క్షీణత