ఏప్రిల్ 11న ఆరిపోనున్న టీడీపీ జ్యోతి : బీజేపీ ఎంపీ జీవీఎల్

ఏప్రిల్ 11న ఆరిపోనున్న టీడీపీ జ్యోతి : బీజేపీ ఎంపీ జీవీఎల్

వచ్చే నెల 11వ తేదీన తెలుగుదేశం పార్టీ జ్యోతి ఆరిపోనుందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు వ్యాఖ్యానించారు. ఆదివారం ఉదయం విజయవాడలో బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఎదుటి పార్టీ నేతలపై బురదజల్లుతున్న టీడీపీ నాయకులు నీచ రాజకీయాలు చేస్తున్నారని నిప్పులు చెరిగిన జీవీఎల్, భూ కబ్జాలు, అవినీతి తప్ప చంద్రబాబు పాలనలో మరేమీ కనిపించలేదని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ తమపై అసత్య ప్రచారాన్ని చేస్తోందని, కేంద్రం నుంచి వచ్చిన డబ్బుతో […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Mar 24, 2019 | 2:00 PM

వచ్చే నెల 11వ తేదీన తెలుగుదేశం పార్టీ జ్యోతి ఆరిపోనుందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు వ్యాఖ్యానించారు. ఆదివారం ఉదయం విజయవాడలో బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఎదుటి పార్టీ నేతలపై బురదజల్లుతున్న టీడీపీ నాయకులు నీచ రాజకీయాలు చేస్తున్నారని నిప్పులు చెరిగిన జీవీఎల్, భూ కబ్జాలు, అవినీతి తప్ప చంద్రబాబు పాలనలో మరేమీ కనిపించలేదని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ తమపై అసత్య ప్రచారాన్ని చేస్తోందని, కేంద్రం నుంచి వచ్చిన డబ్బుతో ప్రజలకు సంక్షేమ పథకాలను, ఇళ్ల నిర్మాణాన్ని చేపడుతూ, ఆ నిధులన్నీ రాష్ట్ర ప్రభుత్వానివేనని చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని జీవీఎల్ అన్నారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu