AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Venus Transit: కుంభ రాశిలో శుక్రుడు.. ఆ రాశుల వారు జీవితంలో ఓ మెట్టు పైకి..

Shukra Gochar 2026: ఫిబ్రవరి 6వ తేదీ నుంచి మార్చి 1వ తేదీవరకు కుంభ రాశిలో సంచారం చేయబోతున్న శుక్రుడి వల్ల కొన్ని రాశుల వారు అదృష్టవంతులు కాబోతున్నారు. సుఖ సంతోషాలకు, భోగభాగ్యాలకు, శృంగార జీవితానికి, ప్రేమలు, పెళ్లిళ్లకు కారకుడైన శుక్రుడు కుంభరాశిలో సంచారం ప్రారంభించడం వల్ల ఆదాయం, సంపద, బ్యాంక్ బ్యాలెన్స్ వంటివి బాగా వృద్ధి చెందుతాయి. దాంపత్య జీవితం బాగా మెరుగుపడుతుంది. కుంభ రాశి శుక్రుడికి మిత్ర క్షేత్రమైనందువల్ల ఇక్కడ శుక్రుడు గరిష్ఠంగా శుభ ఫలితాలనిస్తాడు. శుక్రుడి కుంభ రాశి సంచారం వల్ల మేషం, వృషభం, మిథునం, తుల, మకరం, కుంభ రాశులు ఈ ఫలితాలనన్నిటినీ అనుభవించడం జరుగుతుంది.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 30, 2026 | 6:54 PM

Share
మేషం: ఈ రాశికి లాభ స్థానంలో శుక్రుడి సంచారం వల్ల ఇబ్బడి ముబ్బడిగా ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాల జోరు పెరుగుతుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కలుగుతుంది. ఆరోగ్య లాభం కలుగుతుంది.

1 / 6
వృషభం: రాశినాథుడైన శుక్రుడు దశమ స్థానంలో సంచారం చేయడం వల్ల విపరీత రాజయోగం కలుగుతుంది. దీనివల్ల ఉద్యోగంలో తప్పకుండా ఉన్నత పదవులు లభించే అవకాశం ఉంది. ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. రాజపూజ్యాలు కలుగుతాయి. నిరుద్యోగులకు అరుదైన అవకాశాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి బాటపడతాయి. శత్రు, రోగ, రుణ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు.

2 / 6
మిథునం: ఈ రాశికి భాగ్య స్థానంలోకి శుక్రుడు ప్రవేశించడం వల్ల మహా భాగ్య యోగం కలుగుతుంది. విదేశీ సంపాదన అనుభవించే యోగం పట్టే అవకాశం కూడా ఉంది. అనేక వైపుల నుంచి ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆస్తి పాస్తులు అభివృద్ధి చెందుతాయి. నిరుద్యోగులకు, ఉద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు అందుతాయి. విదేశీయానానికి మార్గం సుగమం అవుతుంది. తండ్రి నుంచి వారసత్వ సంపద లభిస్తుంది.

3 / 6
తుల: రాశ్యధిపతి శుక్రుడు పంచమ స్థానంలో సంచారం వల్ల అనేక విధాలుగా అదృష్టం తలుపు తడుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా కలసి వస్తుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో హోదా పెరుగుతుంది. సామాజికంగా గుర్తింపు లభిస్తుంది. కీర్తి ప్రతిష్ఠలు వృద్ది చెందుతాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది.

4 / 6
మకరం: ఈ రాశికి అత్యంత శుభుడైన శుక్రుడు ధన స్థానంలో ప్రవేశించడంతో పాటు ధన కారకుడైన గురువు వీక్షణ పొందుతున్నందువల్ల ఊహించని స్థాయిలో ధనాభివృద్ధి కలుగుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆరోగ్యం బాగా కుదుట పడుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది.

5 / 6
కుంభం: ఈ రాశికి అత్యంత శుభుడైన శుక్రుడు ఈ రాశిలో ప్రవేశించడం వల్ల ఏలిన్నాటి శని దోషం నుంచి కొద్ది రోజుల పాటు విముక్తి కలుగుతుంది. కష్టనష్టాల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. ఆదా యం దిన దినాభివృద్ధి చెందుతుంది. రావలసిన డబ్బు వసూలవుతుంది. ఆస్తుల విలువ పెరుగుతుంది. ఆస్తి సమస్యలు పరిష్కారమవుతాయి. తండ్రి నుంచి ఆస్తి లభిస్తుంది. బ్యాంక్ బ్యాలెన్స్ బాగా వృద్ధి చెందుతుంది. కుటుంబంలోనూ, దాంపత్యంలోనూ సుఖ సంతోషాలు నెలకొంటాయి.

6 / 6