ఎన్నికల బరిలో వారసుల పోరాటం
సార్వత్రిక ఎన్నికల్లో పోరాటానికి సీఎం, మాజీ సీఎంల వారసులు సై అంటే సై అంటున్నారు . స్వశక్తితో రాణిస్తున్నవారు కొందరైతే.. తొలిసారి బరిలోకి దూకిన వారు ఇంకొందరు. ఈ కోవలో గుంటూరు జిల్లాకు చెందిన దివంగత సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి మనవడు కాసు మహేష్ రెడ్డి గురజాల అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అలాగే తెనాలి నుంచి మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు తనయుడు మనోహర్ జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మాజీ […]

సార్వత్రిక ఎన్నికల్లో పోరాటానికి సీఎం, మాజీ సీఎంల వారసులు సై అంటే సై అంటున్నారు . స్వశక్తితో రాణిస్తున్నవారు కొందరైతే.. తొలిసారి బరిలోకి దూకిన వారు ఇంకొందరు. ఈ కోవలో గుంటూరు జిల్లాకు చెందిన దివంగత సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి మనవడు కాసు మహేష్ రెడ్డి గురజాల అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అలాగే తెనాలి నుంచి మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు తనయుడు మనోహర్ జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
మాజీ సీఎం, దివంగత నందమూరి తారక రామారావు తనయుడు బాలకృష్ణ అనంతపురం జిల్లా హిందూపురం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కర్నూలు జిల్లాకు చెందిన మాజీ సీఎం కోట్ల విజయభాస్కరరెడ్డి తనయుడు సూర్య ప్రకాశ్ రెడ్డి కర్నూలు ఎంపీగా పోటీ చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. గీతం సంస్థల ప్రెసిడెంట్…నందమూరి బాలకృష్ణ అల్లుడైన శ్రీభరత్ టీడీపీ తరపున విశాఖ లోక్‍సభ సీటును ఆశిస్తున్నారు.



