AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrababu–Daggubati Venkateswara Rao: పిక్ ఆఫ్ ది డే… ఎన్నాళ్లకెన్నాళ్లకో.. ఒకే ఫ్రేమ్‌లో బాబు, దగ్గుబాటి

వాళ్లు కలిస్తే ఆశ్చర్యం… ఇరువురు మాట్లాడుకుంటే సంచలనమే.. అసలు అలా జరుగుతుందా అనుకుంటున్న తరుణంలో తెలుగురాష్ట్రాల ప్రజలకు షాకిచ్చారు కో బ్రదర్స్. ‌

Chandrababu--Daggubati Venkateswara Rao: పిక్ ఆఫ్ ది డే... ఎన్నాళ్లకెన్నాళ్లకో.. ఒకే ఫ్రేమ్‌లో బాబు, దగ్గుబాటి
CBN- Daggubati
Ram Naramaneni
|

Updated on: Dec 10, 2021 | 8:17 PM

Share

వాళ్లు కలిస్తే ఆశ్చర్యం… ఇరువురు మాట్లాడుకుంటే సంచలనమే.. అసలు అలా జరుగుతుందా అనుకుంటున్న తరుణంలో తెలుగురాష్ట్రాల ప్రజలకు షాకిచ్చారు కో బ్రదర్స్. ‌ ఇద్దరూ ఆప్యాయంగా కబుర్లు చెప్పుకుంటూ టాక్‌ ఆఫ్‌ ది స్టేట్స్‌ అయ్యారు. ఇంతకీ ఎవరా బ్రదర్స్‌.. ఏంటా కథా అనుకుంటున్నారా.. అయితే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే. చంద్రబాబు, దగ్గుబాటి కుటుంబాలు ఆత్మీయంగా మాట్లాడుకున్నాయి. అవును మీరు వింటున్నది నిజమే.. ఇంకా షాకింగ్‌ ఏంటంటే.. తోడళ్లుల్లు చంద్రబాబు- దగ్గబాటి ఇద్దరూ కబుర్లతో కాలక్షేపం చేశారు..

చాలా కాలం తర్వాత చంద్రబాబు, దగ్గుబాటి కుటుంబాలు కలిసి సరదాగా గడిపాయి. ఎన్టీఆర్ కుమార్తె ఉమామహేశ్వరి కూతురు ఎంగేజ్‌మెంట్‌లో ఈ ఆత్మీయ పలకరింపులు కనిపించాయి. అక్కా చెల్లెళ్ల మధ్య మంచి బంధమే ఉంది. నారా భువనేశ్వరి.. దగ్గుబాటి పురంధేశ్వరి తరచుగా కలుస్తుంటారు.. మాట్లాడుకుంటారు. కానీ చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఇటీవల కాలంలో కలిసింది లేదు.. వాళ్లిద్దరూ కలుసుకున్నట్టు ఎక్కడా చిన్న వీడియో, ఫోటో కూడా బయటకు రాలేదు. చాలాకాలం తర్వాత ఇలా ఇద్దరూ సరదాగా గడిపిన ఫోటోలు ఇప్పుడు వైరల్‌ అయ్యాయి.

కొన్నేళ్లుగా ఇరు కుటుంబాల మధ్య మాటలు లేవు. 1995 సంక్షోభంలో కలిసే ఉన్నా తర్వాత రాజకీయంగా విబేధాలతో విడిపోయారు. మాటలూ దూరమయ్యాయి. రాజకీయంగా పురంధేశ్వరి కాంగ్రెస్‌లో చేరి రెండుసార్లు కేంద్రమంత్రి అయ్యారు. తర్వాత బీజేపీలో చేరి ప్రస్తుతం ఆ పార్టీలో అత్యున్నత జనరల్‌ సెక్రటరీ హోదాలో ఉన్నారు. దగ్గుబాటు గతంలో వైసీపీ లో చేరారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. పలు సందర్భాల్లో చంద్రబాబుపై విమర్శలు చేసిన దగ్గుబాటి పుస్తకం కూడా రాశారు. పేరుకు బంధుత్వం ఉన్నా… ఆప్యాయంగా కలిసిన సందర్భాలు ఎక్కడా లేవు. ఇలాంటి సమయంలో రెండు కుటుంబాలు మళ్లీ కలుసుకుని ఆప్యాయంగా పలకరించుకోవడం తెలుగురాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. నందమూరి ఫ్యాన్స్‌ ఆనందం వ్యక్తం చేస్తుండగా.. పొలిటికల్‌ సర్కిల్స్‌లో మాత్రం పలకరింపులేనా.. రాజకీయ చర్చలూ జరిగాయా అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు.

Also Read: చిన్నారి ప్రయాణిస్తోన్న కార్ మాత్రమే కాదు.. తన మనసు కూడా చాలా రిచ్..

యూట్యూబ్‌ చూసి బ్రకోలి సాగు… లక్షల్లో లాభాలు గడిస్తోన్న రైతు

2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా