‘లెటర్ బాంబ్’ తుస్సు ! మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ ని తొలగించం, శరద్ పవార్
ముంబై మాజీ సీపీ పరమ్ బీర్ సింగ్..మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రేకి రాసిన 'లెటర్ బాంబ్' తుస్సుమంది. రాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ ని తొలగించే ప్రసక్తి లేదని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తేల్చి చెప్పారు.
ముంబై మాజీ సీపీ పరమ్ బీర్ సింగ్..మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రేకి రాసిన ‘లెటర్ బాంబ్’ తుస్సుమంది. రాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ ని తొలగించే ప్రసక్తి లేదని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తేల్చి చెప్పారు.ముకేశ్ అంబానీ ఇంటివద్ద సెక్యూరిటీ వైఫల్యానికి సంబంధించిన కేసు దర్యాప్తు నుంచి దృష్టి మళ్లించడానికే పరమ్ బీర్ సింగ్ ఈ ఆరోపణలు చేశారని ఆయన చెప్పారు. ఇవి పస లేని ఆరోణలన్నారు. పోలీస్ కమిషనర్ పదవి నుంచి తనను మరో విభాగానికి బదిలీ చేసినందుకే సింగ్ వీటిని చేసినట్టు ఆయన అన్నారు. అంబానీ బాంబ్ కేసులో ఎస్ యూ వీ వాహన యజమాని మాన్ సుఖ్ హీరేన్ ని ఎవరు హతమార్చారు ? ఆయన ఎలా మరణించాడు తదితర విషయాల్లో దర్యాప్తు సరిగా జరగని కారణంగానే దీని నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి సింగ్ ఈ ఆరోపణలు చేసినట్టు తెలుస్తోందని పవార్ పేర్కొన్నారు .ముంబై యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ దీనిపై సవ్యంగా ఇన్వెస్టిగేట్ చేస్తోందని, దాని ‘దిశ’ నుమార్చడానికి సింగ్ ఈ విధమైన ఆరోపణలు చేశారని అన్నారు. తమ పార్టీకి చెందిన అనిల్ దేశ్ ముఖ్ పై ఎలాంటి చర్య తీసుకునే ఉద్దేశం కూడా లేదని ఆయన తెలిపారు. పైగా మాజీ పోలీసు అధికారి సచిన్ వాజే ..అనిల్ దేశ్ ముఖ్ ని కలిశారని చెబుతున్న సమయంలో ఆయన కరోనాతో బాధ పడుతూ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారని ఆయన చెప్పారు. గత నెల 5 నుంచి 27 వరకు అనిల్ ఆసుపత్రిలో ఉన్నారని, ఆ తరువాత విశ్రాంతి తీసుకునేందుకు తన స్వస్థలమైన నాగ్ పూర్ వెళ్లారని పవార్ వివరించారు. అలాంటప్పుడు ఆయన రాజీనామా చేసే ప్రసక్తే తలెత్తదన్నారు.
ముంబైలోని బార్లు, రెస్టారెంట్ల నుంచి నెలకు 100 కోట్ల రూపాయలు వసూలు చేయవలసిందిగా సచిన్ వాజేను అనిల్ దేశ్ ముఖ్ ఆదేశించారని పరమ్ బీర్ సింగ్..సీఎం ఉద్ధవ్ థాక్రేకి రాసిన లేఖలో ఆరోపించారు. ఇది మహారాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపింది. కాగా ..అనిల్ దేశ్ ముఖ్ పై తాను చేసిన ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని కోరుతూ సింగ్… సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
మరిన్ని ఇక్కడ చదవండి: వినియోగదారుల కమిషన్ సంచలన తీర్పు.. మారుతి సుజుకి కంపెనీ డీలర్‌కి 2 లక్షల ఫైన్.. ఎందుకో తెలుసా..