AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వినియోగదారుల కమిషన్ సంచలన తీర్పు.. Maruti Suzuki ఢీలర్‌కి 2 లక్షల ఫైన్.. ఎందుకో తెలుసా..

Maruti Suzuki Compeny: కొనుగోలు దారుడి వాహనంలో డెంట్ రిపేర్ చేయనందుకు మారుతి సుజుకి కంపెనీ ఆధీకృత డీలర్‌కి వినియోగదారుల కమిషన్ ఫోరం రూ.2 లక్షల

వినియోగదారుల కమిషన్ సంచలన తీర్పు.. Maruti Suzuki ఢీలర్‌కి 2 లక్షల ఫైన్.. ఎందుకో తెలుసా..
Maruti Suzuki Compeny
uppula Raju
|

Updated on: Mar 22, 2021 | 3:04 PM

Share

Maruti Suzuki : కొనుగోలు దారుడి వాహనంలో డెంట్ రిపేర్ చేయనందుకు మారుతి సుజుకి కంపెనీ ఆధీకృత డీలర్‌కి వినియోగదారుల కమిషన్ ఫోరం రూ.2 లక్షల ఫెనాల్టీ విధించింది. వివరాల్లోకి వెళితే.. కొత్తపేట నివాసి ఎం.వి. సుబ్రహ్మణ్యం మలక్‌పేటలోని జెమ్ మోటార్స్ నుంచి రూ. 12,68,209 లకు మారుతి ఎస్ క్రాస్ జీటాను కొనుగోలు చేశాడు. నెల తర్వాత కారు బోనెట్, డోర్స్, పై కప్పుకు గీతలు పడ్డాయని ఆరోపించాడు. అంతేకాకు కారు ఏసీ నుంచి దుర్వాసన వస్తోందని ఫిర్యాదు చేశాడు. ఇంకా ముంగు గ్లాస్ సమస్య ఉందని, వెనుక మడ్‌గార్డ్ సరిగ్గా అమర్చలేదని ఆరోపించాడు. ఈ సమస్యలన్నీ జనరల్ మేనేజర్‌కి విన్నవించాడు.

దీంతో అతడు టెప్లాన్తో పూత పెట్టమని సూచించాడు. మిగతా విషయాలన్ని వర్కర్స్‌కి చెప్పి చేయమన్నాడు. కానీ వారు సరిగ్గా చేయలేదు. అంతేకాకుండా మళ్లీ మడ్‌గార్డును అమర్చలేదు. ఈ విషయమై అతడి కూతురు పలుమార్లు కంపెనీ ప్రతినిధులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదు. దీంతో వారు వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశారు. సమస్య పరిష్కరం కోసం ఇరు పార్టీలు ఫోరం ఎదుట హాజరుకాగా జెమ్ మోటర్స్ కారుపై గీతలు కనిపించడం తయారీ లోపం కానీ సేవాలోపం కాదని ఫోరంనకు వివరించారు. ఫిర్యాదు దారుడి సమస్యలకు ఇప్పటికే పెయింటింగ్ పనిని బంపర్ మార్చడానికి ముందుకొచ్చిందని వివరించారు. అంతేకాకుండా వినియోగదారుడు మాన్యువల్‌లో చెప్పిన మార్గదర్శకాలను పాటించలేదని ఆరోపించారు. ఇరు పార్టీల వాదనలు విన్న ఫోరం ఇలా చెప్పింది.

ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేసి కారు కొనుగోలు చేసిన కస్టమర్ ఆసక్తిని కాపాడటానికి వారు ప్రయత్నించడం లేదు. కారుపై గీతలను ఆధారంగా చేసుకొని వినియోగదారుడిని నిందించడానికి కంపెనీ ప్రయత్నిస్తోందని గమనించింది. ఈ కారణం సేవాలోపంగానే భావిస్తున్నామని కమిషన్ అభిప్రాయపడింది. అంతేకాకుండా ఈ సమస్యల వల్ల వినియోగదారుడు, అతడి కుమార్త మానసికంగా నరకం అనుభవించారిన కమిషన్ గుర్తించి ఈ నిర్ణయం తీసుకుంది. రూ. 50 వేలు చెల్లించాలని కంపెనీని ఆదేశించింది. వాహనం కొనుగోలు చేసిన తేదీ నుంచి 12 శాతం వడ్డీతో అయిన ఖర్చు అంటే రూ.2 లక్షలు, దావా రూ.10000 చెల్లించాలని తీర్పునిచ్చింది.