Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Undavalli Arunkumar : భవిష్యత్‌లో ‘వాళ్ల’ గురించి మాట్లాడితే కాల్చి చంపేస్తారు, ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు

Undavalli Arunkumar on Bharath Bundh : మనకెందుకులే అని అందరూ వదిలిస్తే భవిష్యత్తులో పేదల గురించి మాట్లాడేవారిని..

Undavalli Arunkumar :  భవిష్యత్‌లో 'వాళ్ల' గురించి మాట్లాడితే కాల్చి చంపేస్తారు, ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు
Undavalli
Follow us
Venkata Narayana

|

Updated on: Mar 22, 2021 | 3:38 PM

Undavalli Arunkumar on Bharath Bundh : మనకెందుకులే అని అందరూ వదిలిస్తే భవిష్యత్తులో పేదల గురించి మాట్లాడేవారిని కాల్చి చంపేసే పరిస్థితి వస్తుందని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ హెచ్చరించారు. ఇప్పటికైనా రాజకీయ పార్టీలన్నీ ఏకమై దేశంలో జరుగుతున్న ఈ ప్రైవేటీకరణలను వ్యతిరేకించాలని ఆయన పిలుపు ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ నిరసన ఉద్యమంలో భాగంగా ఈ నెల 26న కమ్యూనిస్టు పార్టీలు భారత్ బంద్ కు పిలుపు ఇచ్చాయి. ఈ బంద్ కు సహకరించాలని ఉండవల్లిని కలిసి విన్నవించారు కమ్యూనిస్టు నేతలు.

అనంతరం రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఉండవల్లి.. స్టీల్ ప్లాంట్ కు మద్దతుతుగా జరుగుతున్న బంద్ కు తాను సంపూర్ణ మద్దతు ఇస్తున్నానని ప్రకటించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, భారత దేశంలో కమ్యూనిస్టులు లేకుంటే.. పేదల సమస్యల గురించి మాట్లాడే రాజకీయ పార్టీలు కనుమరుగై పోతాయన్నారు.

గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండడంతోనే కమ్యూనిస్టులను వ్యతిరేకించాల్సి వచ్చేదని, అయితే తాను కమ్యూనిస్టు సిద్ధాంతాలకు వ్యతిరేకమే అయినా.. వారి నిబద్ధతను ఎప్పుడూ ప్రశంసిస్తూ ఉంటానని ఉండవల్లి చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీ పాలనలో దేశంలో ప్రభుత్వ ఆస్తులన్నీ అమ్మేస్తున్నారని మండిపడ్డారు.

2004 మార్చి 31 నాటికి భారత దేశం అప్పు 46 లక్షల కోట్ల రూపాయలుంటే, ప్రధాని మోదీ దాన్ని 2020 డిసెంబర్ నాటికి 1 కోటి 7 లక్షల కోట్ల రూపాయల అప్పుకు పెంచారని విమర్శించారు. మన రాజ్యాంగంలో సోషలిస్ట్ అనే పదం ఉండగా.. ప్రభుత్వ రంగ సంస్థలను ఎలా ప్రైవేటీకరణ చేస్తారని ఉండవల్లి ప్రశ్నించారు. దీనిపై కమ్యూనిస్టు పార్టీలు గట్టిగా పోరాడాలని ఉండవల్లి తెలిపారు.

Read also : Harish rao : ‘తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎలిమినేట్ అయింది.. సమీప భవిష్యత్‌లో తుడిచిపెట్టుకుపోతుంది’

పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..