Navjot Singh Sidhu: నా తుది శ్వాస వరకు పోరాడుతాను.. పంజాబ్‌లో మరింత హీట్ పెంచుతున్న సిద్ధూ వీడియో ట్వీట్..
పంజాబ్‌లో నవజ్యోత్ సింగ్ సిద్ధూ మరోసారి రాజకీయ గందరగోళాన్ని సృష్టించారు. పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి యాంగ్రీ సిద్ధూ రాజీనామా చేశారు.
పంజాబ్‌లో నవజ్యోత్ సింగ్ సిద్ధూ మరోసారి రాజకీయ గందరగోళాన్ని సృష్టించారు. పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి యాంగ్రీ సిద్ధూ రాజీనామా చేశారు. పంజాబ్ కాంగ్రెస్ నాయకులు అతడిని ఒప్పించడంలో చాలా బిజీగా ఉన్నారు. ఏదేమైనా.. పార్టీ హైకమాండ్ ఇకపై దిగివచ్చే మూడ్‌లో లేదని తెలుస్తోంది. పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన తర్వాత నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఓ ప్రకటన విడుదల చేశారు. తన ట్విట్టర్ ఖాతాలో ఇందుకు సంబంధించిన ఓ వీడియోను సిద్ధు షేర్ చేశారు. తన చివరి శ్వాస వరకు సత్యం కోసం పోరాడుతూనే ఉంటానని వెల్లడించారు. ఈ వీడియోలో సిద్ధూ ప్రతిపక్షాలను కూడా టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు.
నవజ్యోత్ సింగ్ సిద్ధూ మాట్లాడుతూ.., ”నాకు ఎవరితోనూ వ్యక్తిగత గొడవలు లేవు. 17 ఏళ్ల నా రాజకీయ ప్రయాణం ఒక లక్ష్యం కోసం జరిగిందని… పంజాబ్ ప్రజల జీవితాలను మెరుగుపరచడం, సామాన్యుల సమస్యల కోసం పోరాటం చేయడం.. ఈ రోజు వరకు నేను ఎవరితోనూ వ్యక్తిగత పోరాటం చేయలేదు. నేను నైతికత విషయంలో రాజీపడను. ఇంకా ఇలా అన్నారు. ‘నేను హైకమాండ్‌ను తప్పుదోవ పట్టించలేను… అలా అని తప్పుదోవ పట్టించేవారిని కూడా ఉపేక్షించను. నేను పంజాబ్ ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి, న్యాయం కోసం పోరాడటానికి ఏ త్యాగం సిద్ధం.” అంటూ తన ట్విట్టర్ వీడియోలో వెల్లడించారు.
हक़-सच की लड़ाई आखिरी दम तक लड़ता रहूंगा … pic.twitter.com/LWnBF8JQxu
— Navjot Singh Sidhu (@sherryontopp) September 29, 2021
ఇవి కూడా చదవండి: IPL 2021 RR vs RCB Live Streaming: విజయం కోసం సంజూ-విరాట్ మధ్య పోరాటం.. ఎప్పుడు, ఎక్కడ, ఎలా మ్యాచ్‌లు చూడాలో తెలుసుకోండి