IPL 2021 RR vs RCB Live Streaming: విజయం కోసం సంజూ-విరాట్‌ మధ్య పోరాటం.. ఎప్పుడు, ఎక్కడ, ఎలా మ్యాచ్‌లు చూడాలో తెలుసుకోండి

ఐపీఎల్ (IPL 2021) లో సంజు శాంసన్ కెప్టెన్సీలో రాజస్తాన్ రాయల్స్  .. విరాట్ కోహ్లీ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఉత్కంఠ పోరు తెరలేస్తోంది.

IPL 2021 RR vs RCB Live Streaming: విజయం కోసం సంజూ-విరాట్‌ మధ్య పోరాటం.. ఎప్పుడు, ఎక్కడ, ఎలా మ్యాచ్‌లు చూడాలో తెలుసుకోండి
Rr Vs Rcb
Follow us
Sanjay Kasula

|

Updated on: Sep 29, 2021 | 7:38 AM

RR Vs RCB: ఐపీఎల్ (IPL 2021) లో సంజు శాంసన్ కెప్టెన్సీలో రాజస్తాన్ రాయల్స్  .. విరాట్ కోహ్లీ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఉత్కంఠ పోరు తెరలేస్తోంది. పాయిట్ల పట్టికలో ఏడవ స్థానంలో ఉన్న రాజస్తాన్‌కు ఈ మ్యాచ్ చాలా కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం సంజు శాంసన్‌కు డూ ఆర్ డై పరిస్థితి నెలకొంది. 10 మ్యాచ్‌లు ఆడిన రాజస్తాన్ జట్టు కేవలం నాలుగు విజయాలను అందుకుని ఏడవ స్థానంలో కొనసాగుతోంది. అదే విధంగా పది మ్యాచులు ఆడి ఆరింటిలో విజయం సాధించి పాయింట్ల పాట్టికలో మూడో స్థానంలో కొనసాగుతున్న RCB ని డీ కొట్టాల్సి ఉంది.  

మంచి దూకుడుతో ముందుకు వెళ్తున్న ఆర్‌సీబీకి ఈ సీజన్ మంచి శుభారంభాం లభించింది. మరోవైపు, మొదటి మ్యాచ్‌లో రెండు పరుగుల తేడాతో గెలిచిన రాజస్తాన్ గత రెండు మ్యాచ్‌లలోనూ ఓడిపోయింది. కెప్టెన్ సంజు శాంసన్ తోపాటు యశస్వి జైస్వాల్ మినహా వారి బ్యాట్స్‌మన్‌లందరూ పేలవమైన ఫామ్‌లో ఉన్నారు. బౌలర్లలో కార్తీక్ త్యాగి, చేతన్ సకారియా , ముస్తాఫిజుర్ రెహమాన్ చక్కటి ప్రదర్శన చేశారు. బౌలింగ్‌లో, హర్షల్ పటేల్ గత మ్యాచ్‌లో హ్యాట్రిక్‌తో సహా మూడు మ్యాచ్‌ల్లో ఆరు వికెట్లు తీశాడు. యుజ్వేంద్ర చాహల్ కూడా ఐదు వికెట్లు తీశాడు. న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ కైల్ జమీసన్ రెండు మ్యాచ్‌లలో ఒక్క వికెట్ కూడా తీయలేదు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ ఎప్పుడు జరుగుతుంది?

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-రాజస్థాన్ రాయల్స్ మధ్య బుధవారం, సెప్టెంబర్ 29 న మ్యాచ్ జరగనుంది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది?

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ దుబాయ్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ ఏ సమయంలో ప్రారంభమవుతుంది?

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 07:30 గంటలకు ప్రారంభమవుతుంది. టాస్ 07:00 PM కి జరుగుతుంది

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడవచ్చు?

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ స్టార్ నెట్‌వర్క్‌లో ప్రసారం చేయబడుతుంది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని మీరు ఎక్కడ చూడవచ్చు?

హాట్‌స్టార్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని మీరు చూడవచ్చు.

జట్ల వివరాలు ఇలా..

జట్లు: రాజస్థాన్ రాయల్స్: సంజు శాంసన్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, ఎవిన్ లూయిస్, డేవిడ్ మిల్లర్, క్రిస్ మోరిస్, ఒషనే థామస్, ముస్తఫిజుర్ రహమాన్, తబ్రేజ్ షమ్సీ, గ్లెన్ ఫిలిప్స్, చేతన్ సకారియా, రియాన్ పరాగ్, రాహుల్ తెవాటియా, ఆకాశ్ సింగ్, అనూజ్ రావత్, కెసి కరియప్ప, యశస్వి జైస్వాల్, శివమ్ దుబే, శ్రేయస్ గోపాల్, కార్తీక్ త్యాగి, మయాంక్ మార్కండే, జయదేవ్ ఉనద్కట్, కుల్దీప్ యాదవ్, మహిపాల్ లోమ్రర్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), నవదీప్ సైనీ, గ్లెన్ మాక్స్‌వెల్, డాన్ క్రిస్టియన్, రజత్ పటీదార్, దుష్మంత చమీరా, పవన్ దేశ్‌పాండే, మహ్మద్ సిరాజ్, హర్షాల్ పటేల్, మొహమ్మద్ అజారుద్దీన్, సచిన్ బేబీ, వనిందు హసరంగ, జార్జ్ గార్టెన్, యుజ్వేంద్ర చాహల్, షాబాజ్ అహ్మద్, దేవదత్ పాడిక్కల్, కైల్ జమీసన్, సుయాష్ ప్రభుదేశాయ్, కెఎస్ భరత్, టిమ్ డేవిడ్, ఆకాశ్ దీప్, ఎబి డివిలియర్స్

ఇవి కూడా చదవండి: Bike Stunts: బైక్‌ రేసర్ల ఓవర్ యాక్షన్.. విజయవాడ పోలీసుల రియాక్షన్.. తాట తీస్తామన్న సీపీ శ్రీనివాసులు

Dragonfly: తూనీగలు హెచ్చరిస్తున్నాయా.. మేఘం రంగును గమనిస్తున్నాయా.. కోనసీమవాసుల్లో కొత్త గుబులు..

Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం