MP Rahul Gandhi: ఉత్తరాది రాజకీయాలకు అలవాటుపడ్డ తనకు కేరళ కొత్తగా ఉంది.. తిరువనంతపురంలో రాహుల్ మనసులో మాట..

కేరళ రాజకీయాలు కొత్త ఉన్నాయంటూ కామెంట్ వయనాడ్ ఎంపీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేశారు. ఉత్తరాది రాజకీయాలకు అలవాటుపడ్డ తనకు కేరళ కొత్తగా..

MP Rahul Gandhi: ఉత్తరాది రాజకీయాలకు అలవాటుపడ్డ తనకు కేరళ కొత్తగా ఉంది.. తిరువనంతపురంలో రాహుల్ మనసులో మాట..
Rahul
Follow us
Sanjay Kasula

|

Updated on: Feb 23, 2021 | 7:56 PM

MP Rahul Gandhi: కేరళ రాజకీయాలు కొత్త ఉన్నాయంటూ కామెంట్ వయనాడ్ ఎంపీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేశారు. ఉత్తరాది రాజకీయాలకు అలవాటుపడ్డ తనకు కేరళ కొత్తగా కనిపించిందని వ్యాఖ్యానించారు. మంగళవారం తిరువనంతపురంలో ఏర్పాటు చేసిన సమావేశంలో స్థానిక రాజకీయాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా కేరళలో తన అనుభవాల్ని అక్కడి ప్రజలతో పంచుకున్నారు.

‘‘నేను 15 ఏళ్లు ఉత్తరాదిలో ఎంపీగా ఉన్నాను. ఆ తర్వాత కేరళను ఎంచుకుని ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చినప్పుడు నాకు చాలా కొత్తగా అనిపించింది. నిజానికి నూతనోత్సాహం నాలో కలిగింది. ఇక్కడి రాజకీయాలు, ప్రజలు ముందు స్థానంలో ఉన్నారు. సమస్యల గురించి ప్రజలు అడగటమే కాదు, వాటిపై వారికి చాలా అవగాహన ఉంది. నేను ఇదే విషయాన్ని అమెరికాలో ఉన్న నా మిత్రులతో పంచుకున్నాను. కేరళ వెళ్లడం నాకు చాలా ఆనందాన్ని కలిగించిందని వారితో అన్నాను. కేవలం ఇది రాజకీయ పరమైన భావనే కాదు. మీ రాజకీయాల్లోని ఆ పరిపక్వత నన్ను బాగా ఆకట్టుకున్నాయి. నేను వాటి నుంచి నేర్చుకుంటున్నాను, స్ఫూర్తి పొందుతున్నాను’’ అని రాహుల్ వెల్లడించారు.

కేరళలోని వయనాడ్ నుంచి ఎంపీగా రాహుల్ గాంధీ గెలిచారు. అయితే కేరళ అసెంబ్లీకి మరికొద్ది రోజుల్లో  ఎన్నికలు జరగబోతున్నాయి.