జగన్ తో మోహన్ బాబు భేటీ..!

ఇటీవల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వ్యవహారంలో సినీ నటుడు మోహన్ బాబు తన కొడుకులు మంచు మనోజ్, విష్ణుతో కలిసి తిరుపతిలో ర్యాలీ చేసిన సంగతి తెలిసిందే. ఆ ర్యాలీలో ఆయన టీడీపీ నేతలపై విమర్శలు కూడా చేశారు. అంతేకాదు వాటికీ ధీటుగా టీడీపీ నేతలు కూడా మోహన్ బాబు పై విరుచుకుపడ్డారు. ఇది ఇలా ఉంటే మోహన్ బాబు త్వరలోనే వైకాపాలో చేరున్నారని సమాచారం. ఈ క్రమంలో ఆయన ఆ పార్టీ అధినేత జగన్ ను లోటస్ […]

  • Updated On - 12:59 pm, Tue, 26 March 19
జగన్ తో మోహన్ బాబు భేటీ..!

ఇటీవల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వ్యవహారంలో సినీ నటుడు మోహన్ బాబు తన కొడుకులు మంచు మనోజ్, విష్ణుతో కలిసి తిరుపతిలో ర్యాలీ చేసిన సంగతి తెలిసిందే. ఆ ర్యాలీలో ఆయన టీడీపీ నేతలపై విమర్శలు కూడా చేశారు. అంతేకాదు వాటికీ ధీటుగా టీడీపీ నేతలు కూడా మోహన్ బాబు పై విరుచుకుపడ్డారు. ఇది ఇలా ఉంటే మోహన్ బాబు త్వరలోనే వైకాపాలో చేరున్నారని సమాచారం. ఈ క్రమంలో ఆయన ఆ పార్టీ అధినేత జగన్ ను లోటస్ పాండ్ లో మంగళవారం కలవనున్నారట. దీనితో ఆయన వైకాపాలో చేరతారని ప్రచారం జోరుగా సాగుతోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వ్యవహారంలో అధికార పార్టీ ఆయన మీద దుష్ప్రచారం చేస్తుండడంతో వైకాపాలో చేరేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది.