కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన మోడీ

కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన మోడీ

భూత్పూర్: మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్‌లో ఎన్నికల ప్రచారం సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మోడీ మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌పై మోడీ నిప్పులు చెరిగారు. జ్యోతిష్యుడి సూచన ప్రకారం ముందస్తు ఎన్నికలు నిర్వహించారు. ముందస్తు ఎన్నికల కోసం ఎంత తొందపడ్డారో అంత ఆలస్యంగా మంత్రి మండలిని ఏర్పాటు చేశారంటూ విమర్శలు చేశారు. జ్యోతిష్యుడి సూచన మేరకే చాలా కాలం పాటు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా కాలం గడిపేశారు. ముందస్తు ఎన్నికల కారణంగా […]

Vijay K

|

Mar 29, 2019 | 10:29 PM

భూత్పూర్: మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్‌లో ఎన్నికల ప్రచారం సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మోడీ మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌పై మోడీ నిప్పులు చెరిగారు. జ్యోతిష్యుడి సూచన ప్రకారం ముందస్తు ఎన్నికలు నిర్వహించారు. ముందస్తు ఎన్నికల కోసం ఎంత తొందపడ్డారో అంత ఆలస్యంగా మంత్రి మండలిని ఏర్పాటు చేశారంటూ విమర్శలు చేశారు.

జ్యోతిష్యుడి సూచన మేరకే చాలా కాలం పాటు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా కాలం గడిపేశారు. ముందస్తు ఎన్నికల కారణంగా కోట్ల రూపాయల అదనపు ఖర్చు తెలంగాణ ప్రజల తలపై పడింది. అవే ఎన్నికలు గనక లోక్‌సభ ఎన్నికలతో పాటు జరిగే పరిస్థితి ఉంటే ఎన్నో కోట్ల రూపాయలు మిగలి ఉండేవని మోడీ అన్నారు.

లోక్‌సభ ఎన్నికల్లో మోడీ ముందు నిలబడలేరని జోతిష్యుడు చెప్పడం వల్లనే ముందస్తుకు వెళ్లారు. తెలంగాణ భవిష్యత్తు తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారా? లేక ఒక జోతిష్యుడు నిర్ణయిస్తాడా అని మోడీ ప్రశ్నించారు. బలమైన భారత్ కోసం, తెలంగాణ ఉజ్వల భవిష్యత్తు కోసం రండి, బీజేపీతో కలిసి నడవండి అని మోడీ పిలుపునిచ్చారు.

ప్రజా సేవ కోసం కాదు, స్వార్ధం కోసం రాజకీయాలు చేస్తున్నారు. వారసత్వ రాజీయాలు చేయడంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ ఒకటే. తన కుటుంబం కోసం ప్రజలను కేసీఆర్ పట్టించుకోకుండా వదిలేశారు. టీఆర్ఎస్, ఎంఐఎం మిత్రిత్వం తెలంగాణ కోసం కాదు, వాళ్ల స్వార్ధం కోసమే. భారతమాతను అవమానించే వాళ్లతో, ప్రజాస్వామ్యాన్ని అవమానించే ఇలాంటి వాళ్లతో తెలంగాణ అభివృద్ధి జరగదని టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలపై మోడీ మండిపడ్డారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu