AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన బీజేపీ ఎమ్మెల్యే అరెస్ట్

మధ్యప్రదేశ్ : ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి జైలుపాలయ్యారు బీజేపీకి చెందిన ఓ ఎమ్మెల్యే. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే దిలీప్ సింగ్ పరిహార్‌.. ఎన్నికల కోడ్ ఉల్లంఘించడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యేతో పాటుగా మరో బీజేపీ నేతను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మార్చి 23న ఎమ్మెల్యే దిలీప్ సింగ్ తన పార్టీ కార్యకర్తలతో కలిసి అనుమతి లేకుండా బైకు ర్యాలీ నిర్వహించి, బాణాసంచా పేల్చారు. దీంతో ఈసీ ఫ్లైయింగ్ స్క్వాడ్ టీం ఎమ్మెల్యే […]

ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన బీజేపీ ఎమ్మెల్యే అరెస్ట్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 29, 2019 | 3:26 PM

Share

మధ్యప్రదేశ్ : ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి జైలుపాలయ్యారు బీజేపీకి చెందిన ఓ ఎమ్మెల్యే. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే దిలీప్ సింగ్ పరిహార్‌.. ఎన్నికల కోడ్ ఉల్లంఘించడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యేతో పాటుగా మరో బీజేపీ నేతను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మార్చి 23న ఎమ్మెల్యే దిలీప్ సింగ్ తన పార్టీ కార్యకర్తలతో కలిసి అనుమతి లేకుండా బైకు ర్యాలీ నిర్వహించి, బాణాసంచా పేల్చారు. దీంతో ఈసీ ఫ్లైయింగ్ స్క్వాడ్ టీం ఎమ్మెల్యే సహా మరో ముగ్గురిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈసీ ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. కాగా.. దిలీప్ సింగ్ పరిహార్ ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించడం ఇది రెండోసారి. గత డిసెంబర్ లో జరిగిన శాసన సభ ఎన్నికల సమయంలో కూడా ఎమ్మెల్యే దిలీప్ సింగ్ పరిహార్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. అప్పట్లో ఈసీ హెచ్చరికలు జారీచేసింది.

Follow Us