Kakani Vs Lokesh : లోకేష్ వర్సెస్ ఎమ్మెల్యే కాకాని, పనబాక వర్సెస్ పెద్దిరెడ్డి, టీవీ9 వేదికగా నిరూపణలకు సిద్ధమంటూ ఛాలెంజ్‌లు
Panabaka Lakshmi vs Minister Peddi Reddy : ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ - వైసీపీ నేతల మధ్య మాటల తూటాలు పీక్స్ కు చేరుతున్నాయి...

Panabaka Lakshmi vs Minister Peddi Reddy : ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ – వైసీపీ నేతల మధ్య మాటల తూటాలు పీక్స్ కు చేరుతున్నాయి. మత్స్యకారులకు 43 కోట్ల ప్యాకేజీ ఇచ్చిన విషయం లోకేష్ నిరూపించాలని తాజాగా సవాల్ విసిరారు వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్‌రెడ్డి. లోకేష్ వ్యాఖ్యలు అవాస్తవమని టీవీ9 వేదికగా నిరూపించేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. తాను నిరూపించలేకపోతే 24 గంటల్లో తన రాజీనామా లేఖను టీవీ9కి అందజేస్తానన్నారు కాకాని. ప్రమాణాలు చేయాల్సింది వైసీపీ కాదని.. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణం చేయాలని రివర్స్ కౌంటర్ వేశారాయన. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడవలేదని ప్రమాణం చేయాలని కాకాని డిమాండ్ చేశారు. ఇలా ఉండగా, టీడీపీ రిగ్గింగ్‌కి పాల్పడిందన్న ఏపీ మంత్రి పెద్దిరెడ్డి ఆరోపణలకు ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి పనబాక లక్ష్మి సవాల్ విసిరారు.
గురువారం నిజరూప దర్శనం రోజు శ్రీవారి ముందు తాము రిగ్గింగ్ చేయలేదని ప్రమాణం చేయడానికి సిద్ధమని.. వైసీపీ నేతలు ప్రమాణం చేస్తారా? అని సవాల్ విసిరారు పనబాక. పోలింగ్ జరిగిన తీరు చూస్తే పోలింగ్ కేంద్రాలకు బదులు ఇంట్లో ఈవీఎంలు పెట్టుకొని ఓట్లు వేసుకొని ఉండాల్సిందని పంచ్ విసిరారు. అలా చేస్తే 15, 16 లక్షల మెజారిటీ వస్తుందని.. గిన్నిస్ రికార్డులకు ఎక్కవచ్చని ఎద్దేవా చేశారామె.
తిరుపతి ఉపఎన్నికలో రిగ్గింగ్, దొంగ ఓట్లతో నెగ్గాలని వేసిన ప్రణాళికని తెలుగుదేశం బట్టబయలు చేసింది. ఇప్పటికైనా కేంద్ర ఎన్నికల కమిషన్ స్పందించి పెద్దిరెడ్డి, వైసీపీ మంత్రుల్ని అదుపులోకి తీసుకోవాలి.(4/5)#DemocracyMurderedInAP#YCPFakeVotesScam
— Lokesh Nara (@naralokesh) April 17, 2021

Nara-Lokesh
Read also : Earthquake in Japan and Iran : ఇరాన్ తీర ప్రాంతం, జపాన్ లోని మియాగీ ప్రాంతంలో ఆదివారం ఉదయం భూకంపం