‘మహారాష్ట్ర థర్డ్ కోవిడ్ వేవ్ కి సమాయత్తమవుతోంది’, మంత్రి ఆదిత్య థాక్రే సంచలన వ్యాఖ్యలు
మహారాష్ట్ర త్వరలో మూడో కోవిడ్ వేవ్ ని ఎదుర్కోవడానికి రెడీ అవుతోందని భావిస్తున్నట్టు మంత్రి ఆదిత్య థాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ కేసుల సంఖ్యను తగ్గించి చూపడంవల్ల ప్రయోజనం లేదని తాము గ్రహించామని....
మహారాష్ట్ర త్వరలో మూడో కోవిడ్ వేవ్ ని ఎదుర్కోవడానికి రెడీ అవుతోందని భావిస్తున్నట్టు మంత్రి ఆదిత్య థాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ కేసుల సంఖ్యను తగ్గించి చూపడంవల్ల ప్రయోజనం లేదని తాము గ్రహించామని, ఈ మూడో వేవ్ సెకండ్ వేవ్ కన్నా బలహీనంగా లేదా మరింత ప్రబలంగా ఉండవచ్చునని ఆయన చెప్పారు. వ్యాక్సినేషన్ ప్రస్తుతానికి సహాయపడకపోయినప్పటికీ భవిష్యత్తులో సాయపడే సూచనలు ఉన్నాయని భావిస్తున్నామన్నారు. గత ఏడాది ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ ఆధారంగా ప్రభుత్వం ప్రతి నిర్ణయం తీసుకుంటున్నదని, ఇందులో రాజకీయాలకు తావు లేదని ఆదిత్య థాక్రే తెలిపారు. రాష్ట్రంలో 5 లక్షల బెడ్స్ ఉన్నాయని, వీటిలో 70 శాతం పడకలకు ఆక్సిజన్ సౌకర్యం ఉందని ఆయన చెప్పారు. ఈ పాండమిక్ లో సౌకర్యాలు ఎక్కువగా కల్పించినందున ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ‘ఇటీవలి నెలల్లో ఈ వైరస్ మ్యుటేషన్ గా రూపాంతరం చెందింది.. ఈ పరిస్థితుల్లో ప్రజలు తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది సలహాలను, సూచనలను తీసుకోవాలి’ అని ఆదిత్య థాక్రే సూచించారు. రాష్ట్రంలో 10 నుంచి 15 రోజుల్లో కోవిడ్ చైన్ ని బ్రేక్ చేస్తామని ఆశిస్తున్నాం అన్నారు. ఏమైనా…. ఇది మనుషుల ప్రవర్తనకు సంబంధించినదని, అందువల్ల నిర్దిష్టంగా ఏదీ చెప్పజాలమని అన్నారు.
గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం వలస కూలీల వలసలు తగ్గినట్టు ఆయన అభ్రిపాయపడ్డారు. పరిస్థితి చాలావరకు ‘అదుపులోనే’ ఉంటుందని భావిస్తున్నామన్నారు. పరిశ్రమలు కూడా లేబర్ ను వారి శ్రమశక్తిని వినియోగించుకుంటోందని ఆయన చెప్పారు . ఇలా ఉండగా …. మహారాష్ట్రలో తాజాగా నిన్నటి వరకు 67,123 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. 400 మందికి పైగా కరోనా రోగులు మరణించారు. ఇప్పటివరకు సుమారు 60 వేలమంది మృత్యుబాట పట్టారు. దేశంలో కరోనా కేసుల విషయంలో మహారాష్ట్ర ప్రథమ స్థానంలో ఉంది. కానీ గతంతో పోలిస్తే ఈ సారి పరిస్థితి చాలావరకు మెరుగ్గా ఉందని మంత్రి ఆదిత్య థాక్రే చెప్పడం విశేషం.
మరిన్ని ఇక్కడ చూడండి: కోవిడ్ కేసులు పెరిగిపోతున్నాయ్, బెడ్లు లేవు, ఆక్సిజన్ లేదు, కేంద్రమా ! నీదే భారం ! ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
19 మంది కుంభ్ మేళా భక్తులకు కరోనా పాజిటివ్, చికిత్స పొందుతూ ఆసుపత్రి నుంచి పరార్