కోవిడ్ కేసులు పెరిగిపోతున్నాయ్, బెడ్లు లేవు, ఆక్సిజన్ లేదు, కేంద్రమా ! నీదే భారం ! ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
ఢిల్లీలో కోవిడ్ కేసులు తామరతంపరగా పెరిగిపోతున్నాయని, ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో తెలియడంలేదని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఢిల్లీలో కోవిడ్ కేసులు తామరతంపరగా పెరిగిపోతున్నాయని, ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో తెలియడంలేదని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పాండమిక్ ని పరిష్కరించే విషయంలో తమ ప్రభుత్వానికి సాయపడాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గత 24 గంటల్లో నగరంలో కొత్తగా 25 వేల కోవిడ్ కేసులు నమోదయ్యాయని, సిటీలోని హాస్పిటల్స్ లో 100 కన్నా తక్కువగానే ఐసీయూ బెడ్లు ఉన్నాయని, పైగా ఆక్సిజన్ కొరత కూడా తీవ్రంగా ఉందని ఆయన చెప్పారు. ఈ పరిస్థితుల్లో మీరు తమ ప్రభుత్వాన్ని ఆదుకోవాలని, కేసుల తీవ్రత దృష్ట్యా 7 వేల నుంచి 10 వేల వరకు పడకలు కేటాయించేలా చూడాలని ఆయన…. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ను, హోం మంత్రి అమిత్ షాను కోరారు. వచ్చే రెండు మూడు రోజుల్లో యమునా స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో 6 వేల హై ఫ్లో ఆక్సిజన్ బెడ్స్ ను ఏర్పాటు చేస్తామని కేజ్రీవాల్ తెలిపారు.
కామన్ వెల్త్ క్రీడాగ్రామాలను, కొన్ని స్కూళ్లను కూడా కోవిడ్ సెంటర్లుగా మారుస్తామని ఆయన తెలిపారు. లోగడ కామన్ వెల్త్ క్రీడల కోసం ప్రత్యేకంగా కొన్ని స్టేడియాలను ఏర్పాటు చేసిన విషయం గమనార్హం. వాటినే కామన్ వెల్త్ విలేజీలుగా పేర్కొంటూ వచ్చారు. ఇప్పుడు కరోనా వైరస్ బీభత్సం నేపథ్యంలో వీటిని కోవిడ్ సెంటర్లుగా మార్చాలని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయించింది. ఢిల్లీలో నిన్న ఒక్క రోజే 167 మంది కరోనా రోగులు మరణించారు. ఇదే సమయంలో పాజిటివిటీ రేటు 26 శాతానికి పైగా పెరిగినట్టు ప్రభుత్వం తెలిపింది. దేశంలో మహారాష్ట్ర తరువాత ఢిల్లీ నగరంలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితిల్లో కర్ఫ్యూ వీకెండ్ ని ప్రకటించింది. ఈ నెల 30 వరకు అన్ని జిమ్ సెంటర్లు, ఆడిటోరియాలను మూసివేయాలని ఆదేశించింది. అయితే ఆంక్షల విషయంలో సర్కార్ మరీ కఠినంగా వ్యవహరించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Around 25,000 #COVID19 cases reported in Delhi in last 24 hours. There are 10,000 beds in Delhi, incl that of central govt. Of which, 1,800 beds currently reserved for COVID. I request Centre to allot 7,000 of 10,000 beds in view of severe COVID cases: Delhi CM Arvind Kejriwal pic.twitter.com/bJnFFd6CYZ
— ANI (@ANI) April 18, 2021
మరిన్ని ఇక్కడ చూడండి: 19 మంది కుంభ్ మేళా భక్తులకు కరోనా పాజిటివ్, చికిత్స పొందుతూ ఆసుపత్రి నుంచి పరార్