Sanjay Gaikwad: ‘కరోనావైరస్ దొరికితే.. ఆయన నోట్లో వేస్తా’.. శివసేన ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు..
Coronavirus: దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలోనే కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. నిత్యం 60వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతుండగా.. వందల్లో మరణాలు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో
Sanjay Gaikwad on Devendra Fadnavis: దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలోనే కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. నిత్యం 60వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతుండగా.. వందల్లో మరణాలు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఆక్సిజన్ నిల్వలు నిండుకున్నాయి. దీంతో రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఓవైపు ఆక్సిజన్ నిల్వలు లేకపోవడం.. మరోవైపు వ్యాక్సిన్ లేకపోవడంతో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం.. సాయం చేయాలంటూ కేంద్రాన్ని కోరుతోంది. ప్రస్తుతం రాష్ట్రం, కేంద్రం మధ్య ఆక్సిజన్ సిలిండర్ల వివాదం తారాస్థాయికి చేరింది. శివసేన ప్రభుత్వం కరోనా కట్టడిలో విఫలమైందంటూ మహారాష్ట్రలోని ప్రతిపక్ష బీజేపీ తీవ్రంగా దాడిచేస్తోంది. అయితే.. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలు చేస్తారా అంటూ శివసేన నేత, ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్.. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తనకు కరోనా వైరస్ దొరికితే దానిని నేరుగా ఫడ్నవీస్ నోటిలో వేస్తానంటూ సంజయ్ గైక్వాడ్ పేర్కొన్నారు. రాజకీయాలు చేయడానికి ఇది సమయమా..? అంటూ ఆయన ఫడ్నవీస్‌ను ప్రశ్నించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నందుకు బీజేపీ నాయకులు సిగ్గుపడాలంటూ గైక్వాడ్ ఘాటుగా విమర్శించారు. ఉద్ధవ్ ఠాక్రేతో సహా మంత్రి వర్గం మొత్తం కరోనా కట్టడికి తీవ్రంగా కృషి చేస్తోందని, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదంటూ పేర్కొన్నారు.
ఇదిలాఉంటే.. ఆక్సిజన్ సిలిండర్ల విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఫోన్ చేస్తే.. స్పందించలేదని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. ఉద్ధవ్ కావాలనే ఇలాంటి విమర్శలు చేస్తున్నారంటూ కేంద్రమంత్రులు హర్షవర్ధన్, పీయూష్ గోయల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్ధవ్ తో మాట్లాడేందుకు ప్రధాని ప్రయత్నించినా.. ఆయనే తిరస్కరించారని పేర్కొన్నారు. మహారాష్ట్రకు చాలినంత ఆక్సిజన్ ను సరఫరా చేస్తామంటూ ఉద్ధవ్ కు ప్రధాని హామీ ఇచ్చారని.. కానీ ఆయనే నీచ రాజకీయాలు చేస్తున్నారంటూ హర్షవర్ధన్, గోయల్ పేర్కొన్నారు. కాగా కరోనా కేసులు, మరణాల పరంగా మహారాష్ట్ర దేశంలో మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో ఉద్దవ్ సర్కారు వైరస్‌ను కట్టడి చేయడంలో విఫలమయ్యిందంటూ బీజేపీ నేతలు ఆరోపిస్తుండటంతో.. అధికార పార్టీ నేతలు వారి విమర్శలను తిప్పికొడుతున్నారు.
శివసేన ఎమ్మెల్యే వ్యాఖ్యలు..
If I had found the germs of Corona, I would have put them in the mouth of Devendra Fadnavis ~ Shiv Sena MLA Sanjay Gaikwad
Shivsena busy abusing Opposition instead of tackling virus in worst Covid hit state. pic.twitter.com/lhEunIAJkE
— BALA (@erbmjha) April 17, 2021
Also Read: