హరీశ్‌రావు బ్యాటింగ్‌ అదుర్స్‌.. కేసీఆర్‌ క్రికెట్‌ టోర్నమెంటులో బ్యాట్‌ ఝలిపించిన ఆర్థిక మంత్రి

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లిలో సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా కేసీఆర్ క్రికెట్ టోర్నమెంట్..

హరీశ్‌రావు బ్యాటింగ్‌ అదుర్స్‌.. కేసీఆర్‌ క్రికెట్‌ టోర్నమెంటులో బ్యాట్‌ ఝలిపించిన ఆర్థిక మంత్రి
Follow us

|

Updated on: Feb 24, 2021 | 1:33 PM

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లిలో సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా కేసీఆర్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆర్థిక మంత్రి హరీశ్ రావు‌, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు బ్యాటింగ్‌ చేసి తనదైన శైలిలో మెరుపులు మెరిపించారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ క్రీడలు లేక పిల్లల్లో శారీరక పటుత్వం తగ్గిపోతుందని చెప్పారు. సెల్ ఫోన్ల కు అలవాటు పడిపోయిన యువత.. క్రీడలకు దూరమవుతున్నారని అన్నారు. చిన్న వయసులోనే ఊబకాయం, బీపీ, షుగర్ల వ్యాధిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యువత క్రమం తప్పకుండా వ్యాయమం చేయడం అలవర్చుకోవాలన్నారు.

గేమ్స్ అంటే టైం వేస్ట్ అనుకుంటారు. పబ్ జీ, ఫెస్ బుక్ లాంటి‌వల్ల టైం‌వేస్ట్‌. క్రీడల‌వల్ల ఆత్మ స్థైర్యం పెరుగుతుంది. పోటీ తత్వం పెరుగుతుంది. ఓటమిని‌ స్వీకరించే తత్వం అలావాటవుతుంది. పాస్‌ కాకపోతే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. క్రీడాస్ఫూర్తి అలవాటు కాకపోవడమే దీనికి కారణం. పిల్లల్ని స్కూల్ కు తీసుకెళ్లినట్లే గ్రౌండ్ కు‌ తీసుకెళ్ల్ బాధ్యత తల్లిదండ్రులదే. పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు.

Read more:

లోటస్‌పాండ్‌లో విద్యార్థల సందడి.. మీ అక్కగా సమాజాన్ని మార్చేందుకే వచ్చా.. ఇంకేమీ మాట్లాడారంటే..