AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాజకీయాల్లోకి మరో భారత క్రికెటర్.. ఇవాళ మమతా సమక్షంలో టీఎంసీలో చేరనున్న మనోజ్ తివారి

రాజకీయాల్లోకి వచ్చే క్రికెటర్ల సంఖ్య పెరుగుతోంది. తాజాగా భారత క్రికెటర్ మ‌నోజ్ తివారి రాజకీయ తీర్థం పుచ్చుకోనున్నారు.

రాజకీయాల్లోకి మరో భారత క్రికెటర్.. ఇవాళ మమతా సమక్షంలో టీఎంసీలో చేరనున్న మనోజ్ తివారి
Balaraju Goud
|

Updated on: Feb 24, 2021 | 1:57 PM

Share

Manoj Tiwary : ఫ రాజకీయాల్లోకి వచ్చే క్రికెటర్ల సంఖ్య పెరుగుతోంది. తాజాగా భారత క్రికెటర్ మ‌నోజ్ తివారి రాజకీయ తీర్థం పుచ్చుకోనున్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఇవాళ హుగ్లీలోని ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి మ‌మ‌తా బెన‌ర్జి స‌మ‌క్షంలో టీఎంసీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. త్వరలో జరగనున్న ఆరాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల ప్రచారంలో భాగంగా ఇవాళ చిన్సురాహ్ జిల్లాలోని హుగ్లీలో జరిగే ప్రచార‌స‌భ‌కు మ‌మ‌తాబెన‌ర్జి హాజ‌రుకానున్నారు. ఈ సంద‌ర్భంగా క్రికెట‌ర్ మ‌నోజ్ తివారీ టీఎంసీ కండువా క‌ప్పుకోనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

కాగా, 35 ఏండ్ల మ‌నోజ్ తివారీ ఇప్పటివ‌ర‌కు ప‌శ్చిమ‌బెంగాల్ క్రికెట్ జ‌ట్టు కెప్టెన్‌గా వ్యవహ‌రించారు. బెంగాల్‌లో చోటా దాదాగా పేరున్న మ‌నోజ్‌ భార‌త్ త‌రఫున కూడా 12 వ‌న్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఐపీఎల్‌లో కోల్‌క‌తా నైట్ రైడర్స్‌, కింగ్స్ ఎలెవ‌న్ పంజాబ్‌, రైజింగ్ పుణె సూప‌ర్ జియాంట్స్ జ‌ట్లకు ప్రాతినిధ్యం వ‌హించాడు.

రాజకీయాల్లోకి క్రికెటర్లు రావడం కొత్తేమీ కాదు. అజారుద్దిన్, మహ్మద్ కైఫ్, నవజ్యోత్ సింగ్ సిద్ధూ, గౌతమ్ గంభీర్ వంటి క్రికెటర్లు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించి అనంతరం రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అయితే, భారత జట్టులో కీలక ఆటగాళ్లు, అనేక విజయాలను అందించిన క్రికెటర్ల చూపు ఇప్పుడు రాజకీయాల వైపు మళ్లినట్లు కనిపిస్తుంది.

ఇదీ చదవండిః  Narendra Modi Stadium: నరేంద్ర మోదీ స్టేడియంగా.. మొతేరా మైదానం.. ప్రారంభించిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..