Narendra Modi Stadium: నరేంద్ర మోదీ స్టేడియంగా.. మొతేరా మైదానం.. ప్రారంభించిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్..
Narendra Modi Stadium at Motera: గుజరాత్‌లోని అహ్మదాబాద్ మొతేరాలో నిర్మించిన అతిపెద్ద క్రికెట్ స్టేడియాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ బుధవారం...
Narendra Modi Stadium at Motera: గుజరాత్‌లోని అహ్మదాబాద్ మొతేరాలో నిర్మించిన అతిపెద్ద క్రికెట్ స్టేడియాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ బుధవారం ప్రారంభించారు. దీంతోపాటు అంతకుముందు ఉన్న ఈ స్టేడియం పేరును నరేంద్రమోదీ స్టేడియంగా పేరు మార్చారు. ఇప్పటివరకూ దీన్ని మొతేరా సర్ధార్ వల్లభభాయి పటేల్ స్టేడియంగా వ్యవహరిస్తూ వచ్చారు. ఈ స్టేడియాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంగా సకలసౌకర్యాలతో రూపుదిద్దారు. లక్షా పది వేల సీటింగ్ సామర్థ్యంతో మొతేరాను అత్యాధునికంగా నిర్మించారు. కాగా.. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు, గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవ్రత్, గుజరాత్ డిప్యూటీ సీఎం నితిన్ పటేల్, బీసీసీఐ కార్యదర్శి జై షా పాల్గొన్నారు.
కాగా.. ఈ మైదానంలో తొలి మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. మరికాసేపట్లో భారత్-ఇంగ్లాండ్ మూడో టెస్టు ప్రారంభంకానుంది. ఇంతపెద్ద స్టేడియంలో ఈ మ్యాచ్ గులాబీ బంతితో.. డేనైట్‌లో కొనసాగనుంది. ఈ మ్యాచ్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కేంద్ర మంత్రులతో కలిసి కొంతసేపు వీక్షించనున్నారు.
ఇదిలాఉంటే.. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో.. భారత్ – ఇంగ్లాండ్ జట్లు 1-1 తో సమంగా ఉన్నాయి. తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలవగా రెండో టెస్టులో భారత్ విజయం సాధించింది. దీంతో ఈ మూడో టెస్టు ఇరు జట్లకు కీలకంగా మారింది. అయితే డే అండ్ నైట్ టెస్ట్ కావడంతో క్రీడాభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.
Also Read: