Jasprit Bumrah: ఐదేళ్ల కెరీర్‌లో బుమ్రాకు ఇదే తొలిసారి.. బూమ్.. బూమ్… విజృంభిస్తాడా.?
Jasprit Bumrah: ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం అయిన మొతేరాలో టీమిండియా, ఇంగ్లాండ్ జట్ల డే/నైట్ టెస్టులో తలబడబోతున్నాయి...
Jasprit Bumrah: ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం అయిన మొతేరాలో టీమిండియా, ఇంగ్లాండ్ జట్ల డే/నైట్ టెస్టులో తలబడబోతున్నాయి. ఈ మ్యాచ్ సిరీస్‌లో చాలా ముఖ్యమైనదే కాకుండా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌కు చాలా కీలకమైంది. ఇదిలా ఉంటే టీమిండియా జట్టులోని పలువురు ఆటగాళ్లకు ఈ మ్యాచ్ వ్యక్తిగతంగా ప్రత్యేకమైనది. ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మకు 100వ టెస్టు కాగా.. బూమ్.. బూమ్ బుమ్రా ఇంటర్నేషనల్ డెబ్యూ తర్వాత తొలిసారిగా తన సొంత మైదానంలో ఆడటం విశేషం.
2016వ సంవత్సరంలో జస్ప్రిత్ బుమ్రా అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆస్ట్రేలియాతో వన్డేల్లో అరంగేట్రం చేసిన తర్వాత.. టీ20లు.. ఇక 2018లో దక్షిణాఫ్రికాతో టెస్టుల్లో రంగప్రవేశం చేశాడు. ఇక సొంత మైదానంపై బుమ్రా ఇవాళ తన తొలి మ్యాచ్ ఆడనున్నాడు. ఐదేళ్ల కెరీర్‌లో బుమ్రా ఇప్పటివరకు 18 టెస్టులు, 67 వన్డేలు, 49 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. కానీ బుధవారం తన సొంత మైదానంలో ఆడటం ఇదే మొదటిసారి.
అహ్మదాబాద్‌లో జన్మించిన బుమ్రా.. గుజరాత్ జట్టు తరపున డొమెస్టిక్ క్రికెట్‌లో పాల్గొన్నాడు. ఇక బుమ్రాకు ఈ మైదానంతో ప్రత్యేక అనుబంధం ఉన్నట్లు తెలుస్తోంది. జాతీయ మీడియాలో వస్తోన్న కథనాల ప్రకారం.. చిన్నతనంలో బుమ్రా తరచూ తన పాఠశాలకు వెళ్తూ ఈ మైదానాన్ని చూసేవాడట. బుమ్రా అహ్మదాబాద్‌లో జన్మించాడు. అతను దేశీయ క్రికెట్‌లో గుజరాత్ తరఫున ఆడతాడు. బుమ్రాకు ఈ మైదానానికి ప్రత్యేక అనుబంధం ఉంది.
మొతేరా.. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం…
అహ్మదాబాద్ మొతేరా స్టేడియం వేదికగా ఇవాళ్టి నుంచి భారత్, ఇంగ్లాండ్ మధ్య మూడో టెస్టు మ్యాచ్ జరగనుంది. కొత్తగా నిర్మించబడిన ఈ స్టేడియాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రారంభించారు. ఈ వేడుకకు కేంద్ర హోంమంత్రి, గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు అమిత్ షా స్టేడియంలో పాల్గొన్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి:
ఈ ఫోటోలోని రాజకీయ నాయకుడిని గుర్తుపట్టారా.! ఎక్కడో చూసినట్లు ఉందా.?
ఏటీఎం పిన్ మర్చిపోయారా.! డోంట్ వర్రీ.. ఎస్‌బీఐ సరికొత్త ఫీచర్.. వివరాలివే.!
రెప్పపాటులో ఘోరం.. సెల్‌ఫోన్ మోజులో ఒకరు.. ర్యాష్ డ్రైవింగ్‌తో మరొకరు.. వీడియో వైరల్.!
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఐపీఎల్ వేదికలు ఖరారు.. వివరాలు ఇవిగో.!