West Bengal: ‘నేను రాయల్ బెంగాల్ టైగర్’ను.. బలహీన వ్యక్తిని కాదు: సీఎం మమతా బెనర్జీ
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి మోదీ ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేశారు. పశ్చిమ బెంగాల్‌ను గుజరాత్ ఎన్నటికీ పాలించలేదంటూ.. పరోక్షంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలను ఉద్దేశించి..
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి మోదీ ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేశారు. పశ్చిమ బెంగాల్‌ను గుజరాత్ ఎన్నటికీ పాలించలేదంటూ.. పరోక్షంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అంతేకాకుండా తాను రాయల్ బెంగాల్ టైగర్‌ని అని.. తనను ఎవరూ ఎం చేయలేరంటూ పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముర్షిదాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో మమతా మాట్లాడారు. తాను బీజేపీ బెదిరింపులకు తలొగ్గేంత బలహీన వ్యక్తిని కాదంటూ ఆమె పేర్కొన్నారు. తాను బలమైన వ్యక్తినని.. జీవించినంత కాలం ఉన్నతంగా జీవిస్తానని పేర్కొన్నారు. ఇప్పటికీ రాయల్ బెంగాల్ టైగర్ లాగా జీవిస్తున్నానంటూ సీఎం మమతా బెనర్జీ తెలిపారు.
కొందరు తాము మరికొన్నిరోజులే అధికారంలో ఉంటామని చెబుతున్నారని.. కానీ భారీ మెజారిటీతో మరోసారి అధికారం చేపడతామంటూ మమతా ధీమా వ్యక్తంచేశారు. ఎంఫాన్ తుపానుతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోతే కేంద్రం చాలీచాలని సాయం చేసిందని విమర్శించారు. అదానీ వంటి వారికి లబ్ధి చేకూర్చేందుకే కేంద్రం కొత్త సాగు చట్టాలను తీసుకొచ్చిందని విమర్శించారు. బెంగాల్ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాష్ట్రంలో రాజకీయాలు వెడెక్కుతున్నాయి. ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే వారంలో ప్రధాని మోదీ, అమిత్ షా కూడా పర్యటించనున్నారు.
Also Read: