Mamata Banerjee Attacked: మమతా బెనర్జీపై ‘దాడి’, ఈసీ వద్దకు రేపు టీఎంసీ పార్లమెంటరీ బృందం !
Mamata Banerjee Injured: బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై నందిగ్రామ్ లో జరిగిన 'దాడి' ఘటనకు సంబంధించి తృణమూల్ కాంగ్రెస్ కి చెందిన పార్లమెంటరీ ప్రతినిధి బృందం శుక్రవారం ఢిల్లీలో ఎన్నికల కమిషన్ ను కలుసుకోనుంది.
Mamata Banerjee Injured: బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై నందిగ్రామ్ లో జరిగిన ‘దాడి’ ఘటనకు సంబంధించి తృణమూల్ కాంగ్రెస్ కి చెందిన పార్లమెంటరీ ప్రతినిధి బృందం శుక్రవారం ఢిల్లీలో ఎన్నికల కమిషన్ ను కలుసుకోనుంది. ఆరుగురు సభ్యులతో కూడిన ఈ బృందంలో డెరెక్ ఓ బ్రీన్, చంద్రిమా భట్టాచార్య, పార్థా ఛటర్జీ తదితరులు ఉన్నారు. మొదట వీరు ఈ మధ్యాహ్నం కోల్ కతా లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులను కలిశారు. తమ నేతపై ‘దాడి’ జరిగిన నేపథ్యంలో అసలు రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యపై ఈసీ ఎందుకు ఇంత ఉదాసీనంగా ఉంటుందో తాము ప్రశ్నించామని వీరు తెలిపారు. అలాగే సీఎం కాన్వాయ్ వెంట అంబులెన్స్ ఎందుకు లేదని, తమ ముఖ్యమంత్రిని కారులోనే కోల్ కతా కు ఎందుకు తీసుకువెళాల్సి వచ్చిందని వారన్నారు. మమతా బెనర్జీ భద్రతకు కేటాయించిన నలుగురు పోలీసు అధికారులు ఏం చేస్తున్నారని పార్థా ఛటర్జీ తీవ్ర స్వరంతో అన్నారు.మమత కోల్ కతా లోని ఎస్ ఎస్ కెఎం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.
ఆమె ఎడమ కాలు, తుంటి భాగం, భుజంపైన, మెడ పైన గాయాలయ్యాయి. అయితే తన మీద దాడి జరిగినట్టు మమత గురువారం నాటి తన వీడియో సందేశంలో పేర్కొనలేదు. తమ పార్టీ కార్త్యకర్తలంతా సంయమనంతో ఉండాలని, ప్రజలకు ఇబ్బందులు కలిగించే ఎలాంటి చర్యలకూ పాల్పడరాదని ఆమె ఈ సందేశంలో కోరారు. మరో రెండు మూడు రోజుల్లో తను మళ్ళీ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉందన్నారు. ఈ నెల 14 వరకు ఆమె ప్రచార కార్యక్రమాలు రద్దు చేసుకున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు ఇదంతా డ్రామా అని కొట్టి పారేస్తున్న బీజేపీ దీనిపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తోంది.
మరిన్ని ఇక్కడ చదవండి:
Karthikeya: కార్తికేయను వదిలి పెట్టని ప్రముఖ నిర్మాణ సంస్థ.. సినిమా విడుదలకు ముందే మరో అవకాశం..
Online Interview Tips: ఆన్‌లైన్ ఇంటర్వూకి అటెండ్ అవుతున్నారా.? అయితే ఈ జాగ్రత్తలు మీకోసమే..