మమత టాప్ గేర్ : ‘తమ తల్లులు, కూతుళ్లను బొగ్గు దొంగలనడానికి అసలు నోరెలా వచ్చింది మోదీ.. మీకసలు చరిత్రే లేదు’

Mamata Banerjee : బెంగాల్‌ ఎన్నికల ప్రచారం మరింత వేడెక్కింది. హుగ్లీలో జరిగిన ర్యాలీలో ప్రధాని మోదీ, అమిత్ షా, మొత్తం బీజేపీని టార్గెట్‌ చేశారు సీఎం..

మమత టాప్ గేర్ : 'తమ తల్లులు, కూతుళ్లను బొగ్గు దొంగలనడానికి అసలు నోరెలా వచ్చింది మోదీ.. మీకసలు చరిత్రే లేదు'
Follow us
Venkata Narayana

|

Updated on: Feb 24, 2021 | 6:53 PM

Mamata Banerjee : బెంగాల్‌ ఎన్నికల ప్రచారం మరింత వేడెక్కింది. హుగ్లీలో జరిగిన ర్యాలీలో ప్రధాని మోదీ, అమిత్ షా, మొత్తం బీజేపీని టార్గెట్‌ చేశారు సీఎం మమతా బెనర్జీ. కోల్‌స్మగ్లింగ్‌ కేసులో అక్రమంగా తమ కుటుంబసభ్యులను వేధిస్తున్నారని మండిపడ్డారు. తన మేనల్లుడు అభిషేక్‌ భార్య రుజిరాను సీబీఐ ప్రశ్నించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అల్లర్లను ప్రేరేపించే పార్టీ అని ఆరోపించారు. ప్రధాని మోదీ , అమిత్‌షాను దానవ్‌ – రావణ్‌ అంటూ తీవ్రస్థాయిలో విమర్శించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ లాగే మోదీకి జనం బుద్ది చెబుతారని అన్నారు మమత. దేశాన్ని దానవ.. రావణలు నడుపుతున్నారని, దంగాబాజ్ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. ప్రధాని మోదీ బెంగాలీ వచ్చినట్టు నటిస్తున్నారని, కాని తనకు గుజరాతీ మాట్లాడడం వచ్చినప్పటికి మాట్లాడనని అన్నారు.

అసెంబ్లీ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్ రాజకీయాలు రోజురోజుకీ మరింత వేడెక్కుతున్నాయి. బీజేపీ, టీఎంసీల మధ్య ఆరోపణల తీవ్రత పెరుగుతోంది. ఇరుపార్టీల నేతలు ఒకరిపై మరొకరు తీవ్ర పదజాలంతో విమర్శించుకుంటున్నారు. మమతా బెనర్జీ కోడలికి బొగ్గు చోరీ కేసుతో సంబంధం అంటగట్టడంపై, బొగ్గు దొంగలని విమర్శించడంపై మమతా బెనర్జీ తీవ్రంగా మండిపడుతున్నారు. బొగ్గు చోరీ కేసులో తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీ భార్య రుచిరా బెనర్జీకు సీబీఐ సమన్లు జారీ చేయడాన్ని మమతా బెనర్జీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఓ మహిళ పట్ల అగౌరవంగా ప్రవర్తిస్తారా అని ప్రశ్నించారు.

తమ కోడలికి బొగ్గు చోరీ కేసుతో సంబంధముందని అభాండాలు వేయడంపై ఆమె విరుచుకుపడ్డారు. తమ తల్లులు, కూతుళ్లను బొగ్గు దొంగలనడానికి అసలు నోరెలా వచ్చిందని..మీకు అసలు చరిత్రే లేదని దుయ్యబట్టారు. బీజేపీ నేతలు తమ వెన్ను వంచేందుకు ప్రయత్నిస్తున్నారని..రాష్ట్రంలో చొచ్చుకొచ్చి లాక్కోవాలని చూస్తున్నారని ఆరోపించారు. గుజరాత్ ఈ రాష్ట్రాన్ని పరిపాలించజాలదని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల్లో తానే గోల్ కీపర్ అని..బీజేపీకు సింగిల్ గోల్ కూడా రాదని దీదీ జోస్యం చెప్పారు.

File photo:

Read also :

వెనక్కి తగ్గని కేంద్రం మరో ముందడుగు, ఇంటర్‌మినిస్టీరియల్‌ గ్రూప్‌ ఏర్పాటు, ధర నిర్ణయించి విశాఖ ఉక్కు అమ్మకమే తరువాయి