AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైతుల నిరసనలో కొత్త మలుపు, ఆన్ లైన్ లో నేతల ప్రసంగాలకు ఇక ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ !

రైతు చట్టాలను రద్దు చేయాలనీ కోరుతూ అన్నదాతలు చేస్తున్న ఆందోళన దాదాపు మూడు నెలలకు చేరుకుంటోంది. ఈ నేపథ్యంలో దీన్ని పాన్-ఇండియా ఉద్యమంగా..

రైతుల నిరసనలో కొత్త మలుపు,  ఆన్ లైన్ లో నేతల ప్రసంగాలకు ఇక ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ !
Umakanth Rao
| Edited By: Pardhasaradhi Peri|

Updated on: Feb 24, 2021 | 7:40 PM

Share

రైతు చట్టాలను రద్దు చేయాలనీ కోరుతూ అన్నదాతలు చేస్తున్న ఆందోళన దాదాపు మూడు నెలలకు చేరుకుంటోంది. ఈ నేపథ్యంలో దీన్ని పాన్-ఇండియా ఉద్యమంగా మార్చాలని రైతునేతలు యోచిస్తున్నారు. తాము ఎన్ని ప్రయత్నాలు చేసినా..మహాపంచాయత్ లు నిర్వహించినా ఇంకా ఎన్నో రాష్ట్రాలకు ఉద్యమాన్ని తీసుకువెళ్లలేకపోతున్నామని రైతు నేతలు భావిస్తున్నారు. ముఖ్యంగా దేశంలోని దక్షిణాది రాష్ట్రాల విషయంలో తాము సమస్యనెదుర్కొంటున్నామని అంటున్నారు. ఈ కారణంగా తమ ప్రసంగాలను కింది స్థాయి వరకు తీసుకువెళ్లాలని, ఈ విషయంలో భాష ప్రధాన అంశంగా మారుతోందని వారు పేర్కొంటున్నారు. తమ నేతల్లో చాలామంది హిందీ లేదా పంజాబీలో ప్రసంగిస్తున్నారని, హిందీ మాట్లాడని ప్రాంతాలవారికి ఇది అర్థం కాదని జగ్ తార్ సింగ్ బాజ్వా అనే నేత తెలిపారు. అందువల్ల అన్ని ప్రసంగాలను ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో ఆన్ లైన్ ద్వారా ప్రచారం చేయాలని అనుకుంటున్నామని, కానీ ఇది అంత సులభం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

బెంగాలీ, ఒరియా, తెలుగు, కన్నడ , మలయాళం వంటి ప్రాంతీయ  భాషల్లో  స్పీచ్ లను అనువదించాలనుకుంటున్నామని, కానీ ఈ అన్ని భాషల్లో సబ్-టైటిల్స్ వేయడం సాధ్యం కాదు గనుక మొదట ఆంగ్ల భాషలో  మొదలు పెడతామని ఆయన చెప్పారు. ఆ తరువాత క్రమంగా ఇతర భాషల్లో ఈ ప్రక్రియ చేపడుతామన్నారు.అటు- ఘాజీపూర్ బోర్డర్ లో ఇందుకోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రస్తుతం మేము ఐటీ విభాగం ఏర్పాటుపై దృష్టి పెట్టాం.. అని మరో నేత తెలిపారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల నుంచి 15 నుంచి 20 మందితో కూడిన టీమ్ ని ఏర్పాటు చేశామని, రాబోయే రోజుల్లో దాదాపు అన్ని రాష్ట్రాల నుంచి కూడా మరికొంతమంది యువకులను, వలంటీర్లను తీసుకుంటామని ఆయన చెప్పారు. రైతు చట్టాల రద్దుపై మా పోరాటం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చెప్పలేం అన్నారు. కానీ రైతు నాయకులు ఇలా ఆన్ లైన్ ద్వారా ఆంగ్ల భాషా సబ్ టైటిల్స్ తో దేశంలోని నాన్-హిందీ ప్రాంతాలకు కూడా చేరువ కావాలన్న వీరి నిర్ణయం చెప్పుకోదగినదే అంటున్నారు.

Also Read:

Bengal Assembly Polls: బెంగాల్‌లో పోల్ టెన్షన్.. ఎర్ర సామ్రాజ్యానికి దీదీ చెక్.. తాజాగా పెరిగిన బీజేపీ దూకుడు

మమత టాప్ గేర్ : ‘తమ తల్లులు, కూతుళ్లను బొగ్గు దొంగలనడానికి అసలు నోరెలా వచ్చింది మోదీ.. మీకసలు చరిత్రే లేదు’

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..