AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్రికెట్ స్టేడియం పేరు మార్పుపై కాంగ్రెస్ నేతల సెటైర్స్, ‘హమ్ దో హమారే దో’ అంటున్న రాహుల్

అహమ్మదాబాద్ లో అతిపెద్దదైన   'క్రికెట్  స్టేడియం' పేరును 'నరేంద్ర మోదీ స్టేడియం' గా పేరు మార్పుపై కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, శశిథరూర్ తో బాటు గౌరవ్ పాంధీ అనే మరో నేత కూడా..

క్రికెట్  స్టేడియం పేరు మార్పుపై కాంగ్రెస్ నేతల సెటైర్స్, 'హమ్ దో హమారే దో' అంటున్న రాహుల్
Umakanth Rao
| Edited By: |

Updated on: Feb 24, 2021 | 8:22 PM

Share

అహమ్మదాబాద్ లో అతిపెద్దదైన   ‘క్రికెట్  స్టేడియం’ పేరును ‘నరేంద్ర మోదీ స్టేడియం’ గా పేరు మార్పుపై కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, శశిథరూర్ తో బాటు గౌరవ్ పాంధీ అనే మరో నేత కూడా వ్యంగ్యంగా స్పందించారు. ‘హమ్ దో, హమారే దో’ అనే తన విమర్శను రాహుల్ మళ్ళీ ప్రస్తావించారు. ‘నరేంద్ర మోదీ స్టేడియం, అదానీ ఎండ్, రిలయన్స్ ఎండ్, విత్ జే షా'( హోం మంత్రి అమిత్ షా కుమారుడు ) ప్రిసైడింగ్ ‘ అని ఆయన ట్వీట్ చేశారు. రైతు చట్టాలను రద్దు చేయాలంటూ రాహుల్ ఇటీవల తరచూ ఇదే పదాన్ని ప్రస్తావిస్తున్నారు. దేశంలో వ్యవసాయం నలుగురి చేతిలోనే ఉందని, వారే ఈ రంగాన్ని శాసిస్తున్నారని అంటూ ఆయన.. పరోక్షంగా ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, పారిశ్రామికవేత్తలు అదానీ, రిలయన్స్ అధినేతలను పేర్కొంటున్నారు. ఇప్పుడు ఈ స్టేడియం పేరు మార్పు విషయంలో కూడా ఆయన ఇదే పదాన్ని వాడారు. ఇక శశిథరూర్.. మరో విధంగా వ్యాఖ్యానిస్తూ.. ఆర్ ఎస్ ఎస్ ను బ్యాన్ చేయాలంటూ నాటి  మాజీ హోంమంత్రి ఉత్తర్వులు జారీ చేసిన విషయం గుర్తుకు వఛ్చి బహుశా ప్రభుత్వం ఈ స్టేడియం పేరు మార్చినట్టు కనిపిస్తోందన్నారు.

(మొదట దీన్ని సర్దార్ వల్లభ భాయ్ స్టేడియంగా వ్యవహరించారు.) ఇక ట్రంప్ లేదా అలాంటి విదేశీ నేత ఎవరైనా వస్తే అడ్వాన్స్ బుకింగ్ గా ఇలా పేరుమార్చి  ఉండవచ్చు అని కూడా శశిథరూర్ వ్యాఖ్యానించారు. గౌరవ్ పాంధీ అనే మహిళా నేత.. సర్దార్ పటేల్ పేరును తొలగించి నరేంద్ర మోదీ అని పేరు పెట్టడం పటేల్ ని ఘోరంగా అవమానించినట్టేనని, మీ అహంకారానికి హద్దులు ఉన్నాయా మోదీజీ..సిగ్గుచేటు అని ఆమె ట్వీట్ చేశారు. కాగా ఇది నరేంద్ర మోదీ కలల కోర్కె అని, ఇలా పేరు పెట్టినందువల్ల ఆయన కలను సాకారం చేసినట్టయిందని హోం మంత్రి అమిత్ షా తన ప్రసంగంలో పేర్కొన్నారు. లక్షా 32 వేలమంది పట్టే ఇంత పెద్ద స్టేడియం ప్రపంచంలోనే అతి పెద్దదని పేర్కొన్నారు.

Follow Us
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్