AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వెనక్కి తగ్గని కేంద్రం మరో ముందడుగు, ఇంటర్‌మినిస్టీరియల్‌ గ్రూప్‌ ఏర్పాటు, ధర నిర్ణయించి విశాఖ ఉక్కు అమ్మకమే తరువాయి

13రోజులుగా పార్టీలకతీతంగా ఒక్కటై ఉద్యమిస్తున్నారు. కార్మిక సంఘాల నిరసన దీక్షలు చేస్తున్నాయి. అటు అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ఏపీ ప్రభుత్వం..

వెనక్కి తగ్గని కేంద్రం మరో ముందడుగు, ఇంటర్‌మినిస్టీరియల్‌ గ్రూప్‌ ఏర్పాటు, ధర నిర్ణయించి విశాఖ ఉక్కు అమ్మకమే తరువాయి
Venkata Narayana
|

Updated on: Feb 24, 2021 | 5:47 PM

Share

13రోజులుగా పార్టీలకతీతంగా ఒక్కటై ఉద్యమిస్తున్నారు. కార్మిక సంఘాల నిరసన దీక్షలు చేస్తున్నాయి. అటు అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. అయినా కూడా కేంద్రం వెనక్కు తగ్గడం లేదు. విశాఖ ఉక్కు అమ్మకం దిశగా మరో అడుగేసింది. ఇంటర్‌మినిస్టీరియల్‌ గ్రూప్‌ కూడా ఏర్పాటు చేసింది. ఇక మన ఉక్కు పరిశ్రమకు ధర నిర్ణయించి అమ్మకానికి పెట్టడమే మిగిలిందంటున్నారు కార్మిక నాయకులు. ప్రాణత్యాగాలకైనా సిద్దమే కానీ స్టీలు ప్లాంటులో అడ్డుపెట్టనీయమంటున్నారు ఉద్యమకారులు. విశాఖ వేదికగా అటు కేంద్రానికి ఇటు తెలుగోడికి మధ్య జరుగుతున్న యుద్ధమిది. ప్రైడ్‌ ఆఫ్‌ స్టీల్‌ అని చెబుతున్న కేంద్రమే విశాఖ స్టీల్‌ను అడ్డంగా అమ్మకానికి పెట్టింది.

ప్రైవేటీకరణలో భాగంగా తాజాగా మరో అడుగు ముందుకేసింది కేంద్రం. కేబినెట్‌ కమిటీ నుంచి అనుమతి రావడంతో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇన్వెస్టిమెంట్‌ అండ్‌ పబ్లిక్‌ అసెట్‌‌ మేనేజ్‌మెంట్‌ తాజాగా ఇంటర్‌ మినిస్టీరియల్ గ్రూపు కూడా ఏర్పాటు చేసింది. ఇక ఇండస్ట్రీని హైలెవల్‌ కమిటీకి అప్పగించి.. ధర నిర్ణయించి అమ్మడమే మిగిలింది. కేంద్రం మొండిగా పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కార్మికులు. ఇక, విశాఖ వేదికగా పార్టీలన్నీ ఏకమయ్యాయి. విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అని నినదిస్తున్నారు. అయినా దీనిపై అడుగు కూడా వెనక్కు తగ్గడం లేదు హస్తిన పెద్దలు. విశాఖ స్టీల్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్రానికి పంపడానికి సిద్దమైంది. ప్రత్యామ్నాయాలు కూడా సూచిస్తామని రాష్ట్ర సర్కార్‌ చెబుతున్నా వీటిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి ఉద్యమ సంఘాలు. భూములు అమ్మడం.. లేదా ఐపీవోకు వెళ్లడం అంటే దొడ్డిదారిన ప్రైవేటుకు కట్టబెట్టడమేనంటున్నారు సీపీఎం పాలిట్‌ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు.

ఎలాంటి హిడెన్‌ ఎజెండా లేదంటున్న ఏపీ ప్రభుత్వం.. వందశాతం విశాఖ స్టీల్‌ యధాతథంగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నామంటోంది. అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత తమను కాదని కేంద్రమే నిర్ణయం తీసుకోదన్న ధీమా వ్యక్తం చేశారు పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతంరెడ్డి. స్టీల్‌ ప్లాంట్‌ విషయంలో ప్రాణత్యాగాలకు సిద్దంగా ఉన్నామని… అధ్యయన కమిటీలను కూడా అడుగుపెట్టనిచ్చేది లేదంటున్నాయి విపక్షాలు. మొత్తానికి అటు కేంద్రం అమ్మకానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తుంటే… ఇటు అడ్డుకోవడానికి సమాయత్తమవుతోంది కార్మికవర్గం. సాంస్కృతిక, ఆర్థిక చిహ్నాన్ని ప్రైవేటుపరం కాకుండా అడ్డుకుంటారా? చూడాలి.

Read also :

చీటింగ్‌.. విలాసవంతంగా బతకడం, అదే టార్గెట్‌. సిటీలో కిలాడీ లేడీ ట్రాప్‌లో పడి 11 కోట్లు సమర్పించుకున్న వ్యాపారి, సూసైడ్