వివాదస్పద ఎమ్యెల్యేకు సీఎం వార్నింగ్..పద్దతి మార్చుకోవాలంటూ క్లాస్?

సీఎం జగన్..ప్రజల్లో తన విశ్వసనీయత చాటుకునేందుకు ఎంతదూరం వెళ్లడానికైనా సిద్దమైనట్టు తాజా పరిస్థితులు చూస్తుంటే అర్దమవుతుంది. తన తండ్రి వైఎస్సార్ కంటే ఇంకా గొప్ప పాలన అందించడానికి కృషి చేస్తానని జగన్ ముఖ్యమంత్రి కాకముందు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ దిశగా జగన్ అడుగులు పడుతున్నాయి. ముందుగా రాజశేఖర్‌రెడ్డి మాదిరిగానే సంక్షేమానికి ఎక్కువ ప్రధాన్యతనిస్తున్న యువ సీఎం..పార్టీ ప్రతిష్ఠతకు, ప్రజల్లో నమ్మకానికి ఇబ్బంది కలిగించే వ్యక్తులను సొంతపార్టీ నేతలైనా సరే ఉపేక్షించడం లేదు. అందుకు ఇటీవల జరిగిన […]

వివాదస్పద ఎమ్యెల్యేకు సీఎం వార్నింగ్..పద్దతి మార్చుకోవాలంటూ క్లాస్?
Follow us

|

Updated on: Oct 10, 2019 | 10:20 PM

సీఎం జగన్..ప్రజల్లో తన విశ్వసనీయత చాటుకునేందుకు ఎంతదూరం వెళ్లడానికైనా సిద్దమైనట్టు తాజా పరిస్థితులు చూస్తుంటే అర్దమవుతుంది. తన తండ్రి వైఎస్సార్ కంటే ఇంకా గొప్ప పాలన అందించడానికి కృషి చేస్తానని జగన్ ముఖ్యమంత్రి కాకముందు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ దిశగా జగన్ అడుగులు పడుతున్నాయి. ముందుగా రాజశేఖర్‌రెడ్డి మాదిరిగానే సంక్షేమానికి ఎక్కువ ప్రధాన్యతనిస్తున్న యువ సీఎం..పార్టీ ప్రతిష్ఠతకు, ప్రజల్లో నమ్మకానికి ఇబ్బంది కలిగించే వ్యక్తులను సొంతపార్టీ నేతలైనా సరే ఉపేక్షించడం లేదు. అందుకు ఇటీవల జరిగిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంఘటనే ప్రత్యక్ష ఉదాహరణ. మాములుగా అయితే ఇలాంటి విషయాల్లో సొంతపార్టీవారిని అధినాయకత్వం డిఫెండ్ చేసుకుంటుంది. ఆ టాపిక్ దృష్టి మరల్చేందుకు కృషి చేస్తుంది. కానీ జగన్ గవర్నమెంట్ సొంత పార్టీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేయించడం గమనార్హం.

ఎమ్మెల్యల మధ్య గొడవ..మొగ్గలోనే తుంచేసిన వైనం:

నెల్లూరు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేల మధ్య నెలకొన్న పంచాయతీని ఆ పార్టీ నేతలు ఏదో రకంగా సెటిల్ చేశారు. ముందుగా వైసీపీ నేతలతో సమావేశమైన ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి… ఆ తరువాత సీఎం జగన్‌తో సమావేశమయ్యారు. ఓ మహిళా ఉద్యోగిపై దౌర్జన్యం చేశారనే కారణంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై పోలీసు కేసు నమోదు చేయడం… ఆ తరువాత ఈ వ్యవహారం ఎమ్మెల్యేలు కోటంరెడ్డి, కాకాని మధ్య కొత్త విభేదాలకు తెరలేపడంతో వైసీపీ అధినాయకత్వం రంగంలోకి దిగింది. వైసీపీ ముఖ్యనేత, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సహా పలువురు వైసీపీ ముఖ్యనేతలు రంగంలోకి దిగి ఇద్దరితో చర్చలు జరిపారు. వివాదానికి తాత్కాలికంగా ముగింపు పలికారు.

అయితే ఎన్నికలకు ముందు కూడా కోటంరెడ్డిపై పలు కేసులు నమోదయ్యాయి. జిల్లా పోలీసులతో ఆయనకు పొసగడం లేదు.  ఏదో రకంగా వివాదాలు వస్తుండటంతో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీరుపై వైసీపీ అధినేత, సీఎం జగన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఇలా ఎందుకు జరుగుతోందని ఆయన గట్టిగానే ప్రశ్నించినట్టు సమాచారం. అంతేకాదు నెల్లూరులో కాకుండా కొన్నాళ్ల పాటు  అమరావతిలోనే ఉండాలని, నెలలో ఎక్కువ రోజులు అమరావతిలో ఉండాలని సీఎం జగన్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఆదేశించినట్టు తెలుస్తోంది.

నియోజకవర్గం అభివృద్ధిని తాను చూసుకుంటానని సీఎం జగన్ కోటంరెడ్డికి స్పష్టం చేసినట్టు సమాచారం. దీంతో ఇకపై నెలకు 25 రోజులు అమరావతిలోనే ఉండాలని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిర్ణయించుకున్నారన్న టాక్ నడుస్తోంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పడం విశేషం. మొత్తానికి వివాదాలతో పార్టీని ఇబ్బందిపెడుతున్న సొంత పార్టీ ఎమ్మెల్యేకు సీఎం జగన్ గట్టి వార్నింగ్..మిగిలిన నాయకులు కూడా జాగ్రత్తగా ఉండటానికి ఉపయోగపడుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Nellore Rural Mla Kotamreddy comments on Arrest issue