కల్లం బెల్లం.. మంత్రులు అల్లం..!

ఏదో సామెత చెప్పినట్టు కల్లం..బెల్లం.. మంత్రులు అల్లం అన్నట్టుగా ఉంది ఆంధ్రప్రదేశ్ మంత్రుల పరిస్థితి. జగన్ సీఎం అయినప్పటినుంచి పాలనా వ్యవహారాలన్నీప్రధాన సలహాదారు అజేయకల్లంతో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం, మంత్రుల సెక్రటరీలు కూడా అజేయకల్లం చెప్పినట్లు నడుచుకోవడంతో తమ మాట చెల్లడం లేదని మంత్రులు తలలు పట్టుకుంటున్నారు. మంత్రులే కాదు చీఫ్ సెక్రటరీ ఎల్.వి. సుబ్రహ్మణ్యం కూడా ఈవిషయంలో అసంతûÅప్తిగా ఉన్నట్లు సెక్రటేరియట్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేనా మంత్రులకు మింగుడుపడని మరో విషయం ఏంటంటే..ఈ మంత్రుల […]

  • Ravi Kiran
  • Publish Date - 8:30 pm, Thu, 25 July 19
కల్లం బెల్లం.. మంత్రులు అల్లం..!

ఏదో సామెత చెప్పినట్టు కల్లం..బెల్లం.. మంత్రులు అల్లం అన్నట్టుగా ఉంది ఆంధ్రప్రదేశ్ మంత్రుల పరిస్థితి. జగన్ సీఎం అయినప్పటినుంచి పాలనా వ్యవహారాలన్నీప్రధాన సలహాదారు అజేయకల్లంతో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం, మంత్రుల సెక్రటరీలు కూడా అజేయకల్లం చెప్పినట్లు నడుచుకోవడంతో తమ మాట చెల్లడం లేదని మంత్రులు తలలు పట్టుకుంటున్నారు.

మంత్రులే కాదు చీఫ్ సెక్రటరీ ఎల్.వి. సుబ్రహ్మణ్యం కూడా ఈవిషయంలో అసంతûÅప్తిగా ఉన్నట్లు సెక్రటేరియట్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేనా మంత్రులకు మింగుడుపడని మరో విషయం ఏంటంటే..ఈ మంత్రుల దగ్గర ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీలు టీడీపీ హయాంలో కీలకంగా వ్యవహరించినవారే. వీళ్ళంతా ఇంకా జగన్ ప్రభుత్వంలో కొనసాగడం.. వీరి పదవులకి ఎలాంటి ఢోకా లేదని అజేయకల్లం వారికి అభయమివ్వడం సుతరాము మంత్రులకు నచ్చడం లేదు.

మంత్రులుగా తమ మాట చెల్లడంలేదని, తమ శాఖలకు సంబంధించిన ఏ అంశాల్లోనూ తాము నిర్ణయాత్మకంగా వ్యవహరింలేకపోతున్నామని తెగ మధనపడిపోతున్నారు. ఓ పక్క ప్రతిపక్షం హయాంలో పనిచేసినవారు పదవుల్లో కొనసాగడం జీర్ణించుకోలేక.. అటు అజేయ కల్లంని ఏమీ అనలేక సతమతమైపోతున్నారు మెజారిటీ మంత్రులు.