మాజీలపై టీఆర్ఎస్ పార్టీ ఫోకస్..!

ఎవరైనా సైలెంట్ గా ఉంటే.. అబ్బ.. ఎంత బుద్ధి మంతులో అంటాం…కానీ ఇక్కడ బుద్ధి మంతులుగా ఉంటే కుదరదంటున్నారు గులాబీ నేతలు. ఎందుకంటే సైలెన్స్ కాస్తా వైలెన్స్ గా మారే ప్రమాదముందంటున్నారు. అందుకే పార్టీలో యాక్టివ్ గా లేని సీనియర్ నేతలందరిమీదా ఫోకస్ పెట్టారు గులాబీ బాస్. మాజీ ఎంపీలు జితేందర్ రెడ్డి, వివేక్, సోమారపు సత్యనారాయణ సైలెంట్ గా కారు దిగిపోయి కాషాయ కండువా వేసేసుకోవడంతో పెద్ద షాక్ తింది గులాబీ పార్టీ. దీంతో పార్టీలో […]

మాజీలపై టీఆర్ఎస్ పార్టీ ఫోకస్..!
Ravi Kiran

|

Jul 25, 2019 | 9:03 PM

ఎవరైనా సైలెంట్ గా ఉంటే.. అబ్బ.. ఎంత బుద్ధి మంతులో అంటాం…కానీ ఇక్కడ బుద్ధి మంతులుగా ఉంటే కుదరదంటున్నారు గులాబీ నేతలు. ఎందుకంటే సైలెన్స్ కాస్తా వైలెన్స్ గా మారే ప్రమాదముందంటున్నారు. అందుకే పార్టీలో యాక్టివ్ గా లేని సీనియర్ నేతలందరిమీదా ఫోకస్ పెట్టారు గులాబీ బాస్.

మాజీ ఎంపీలు జితేందర్ రెడ్డి, వివేక్, సోమారపు సత్యనారాయణ సైలెంట్ గా కారు దిగిపోయి కాషాయ కండువా వేసేసుకోవడంతో పెద్ద షాక్ తింది గులాబీ పార్టీ. దీంతో పార్టీలో అసంతûప్తిగా ఉన్న నేతలు, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నసీనియర్ నేతలపై నిఘా పెట్టారు. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో టికెట్లు దక్కక కొందరు, కేబినెట్ లో బెర్త్ దొరక్క కొందరు సైలెంట్ అయిపోవడంతో గులాబీ బాస్ అలర్టయ్యారు.

అటు కాషాయ పార్టీ కూడా టీఆర్ఎస్ లో అసంతûప్తి నేతలపై ఫోకస్ పెడుతోంది. ఈ నేపధ్యంలో గులాబీ నేతలెవరైనా బీజేపీకి టచ్ లో ఉన్నారా..? సైలెంట్ గా ఉన్నసీనియర్లంతా ఏం చేస్తున్నారన్న దానిపై నిఘా పెట్టింది గులాబీ అధిష్టానం.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu