సుజనాకు మంత్రి పదవి ఖాయమేనా..?

ఆపరేషన్ టీడీపీ అంటూ ఏపీలో కలకలం రేపుతోంది బీజేపీ. ఆషాఢం పోనీ.. అసలు సినిమా చూపిస్తాం అంటూ తెలుగు తమ్ముళ్ళలో గుబులు రేపుతోంది. తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది కమలదళం. ఇందులో భాగంగానే ఏపీకి కేంద్ర మంత్రి పదవిని ఇవ్వాలని ప్రధాని మోదీ ఆలోచిస్తున్నారట. ఇంకేముంది? ఏపీలో కాషాయ కండువాలు తమ జోరు పెంచేశాయి. మంత్రి పదవి దక్కించుకోడానికి ఆశావహులు తమ ప్రయత్నాలు మొదలు పెట్టేశారు. ఈ రేస్ లో ముందున్న సుజనాచౌదరి […]

  • Ravi Kiran
  • Publish Date - 8:53 pm, Thu, 25 July 19
సుజనాకు మంత్రి పదవి ఖాయమేనా..?

ఆపరేషన్ టీడీపీ అంటూ ఏపీలో కలకలం రేపుతోంది బీజేపీ. ఆషాఢం పోనీ.. అసలు సినిమా చూపిస్తాం అంటూ తెలుగు తమ్ముళ్ళలో గుబులు రేపుతోంది. తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది కమలదళం. ఇందులో భాగంగానే ఏపీకి కేంద్ర మంత్రి పదవిని ఇవ్వాలని ప్రధాని మోదీ ఆలోచిస్తున్నారట.

ఇంకేముంది? ఏపీలో కాషాయ కండువాలు తమ జోరు పెంచేశాయి. మంత్రి పదవి దక్కించుకోడానికి ఆశావహులు తమ ప్రయత్నాలు మొదలు పెట్టేశారు. ఈ రేస్ లో ముందున్న సుజనాచౌదరి ఢిల్లీలో ఓ రేంజ్ లో పావులు కదుపుతున్నారు. మరోవైపు సుజనాపై ఉన్న కేసులు అతనికి అడ్డంకిగా మారొచ్చని రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.

అయితే నిన్నగాక మొన్న వచ్చినవారికి మంత్రి పదవి ఇచ్చే సీన్ ఉండదు అనుకుంటున్నారు ఏపీ బీజేపీ నేతలు. అయితే ఏపీలో బలపడటమే అధిష్టానం లక్ష్యం కావడంతో ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్యా.. అధిష్టానంకి కనెక్ట్ అయ్యామా లేదా? అన్నదే ముఖ్యం అంటున్నారు సుజనా.. రాష్ట్రవ్యాప్తంగా తెలుగు తమ్ముళ్లతో మంచి పరిచయాలున్న సుజనా వారందరినీ సైకిల్ దించాలంటే తాను బలమైన నేతగా ఫోకస్ కావాలి అన్న వాదనను హైకమాండ్ కి గట్టిగానే వినిపిస్తున్నారు. మరి మోదీ, షా ఆలోచనేంటో.. వేచి చూడాల్సిందే.