ఏపీ బ్రాండ్ ఎంబాసిడర్ ఎన్టీఆర్ కాదట.. అసలు నిజమిదే!

ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ఎన్టీఆర్ ఫ్యామిలీ టార్గెట్ గా ఆపరేషన్ ఎన్టీఆర్ ఫ్యామిలీకి తెరలేపినట్టు తెలుస్తోంది. అయితే చంద్రబాబు అండ్ కో కూడా జగన్ స్కెచ్ ని ఓ కంట కనిపెడుతూనే ఉన్నట్లు సమాచారం. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని విశ్వవ్యాప్తం చేసిన విశ్వవిఖ్యాత నటుడు,తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ప్రజానేత ఎన్టీఆర్. అయితే చంద్రబాబు ఎన్టీఆర్ పేరును వాడుకున్నారు తప్ప.. అతనికి ఎలాంటి గౌరవం ఇవ్వలేదని చెప్పడమే లక్ష్యంగా బందరు […]

ఏపీ బ్రాండ్ ఎంబాసిడర్ ఎన్టీఆర్ కాదట.. అసలు నిజమిదే!
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 25, 2019 | 9:17 PM

ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ఎన్టీఆర్ ఫ్యామిలీ టార్గెట్ గా ఆపరేషన్ ఎన్టీఆర్ ఫ్యామిలీకి తెరలేపినట్టు తెలుస్తోంది. అయితే చంద్రబాబు అండ్ కో కూడా జగన్ స్కెచ్ ని ఓ కంట కనిపెడుతూనే ఉన్నట్లు సమాచారం.

తెలుగువాడి ఆత్మగౌరవాన్ని విశ్వవ్యాప్తం చేసిన విశ్వవిఖ్యాత నటుడు,తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ప్రజానేత ఎన్టీఆర్. అయితే చంద్రబాబు ఎన్టీఆర్ పేరును వాడుకున్నారు తప్ప.. అతనికి ఎలాంటి గౌరవం ఇవ్వలేదని చెప్పడమే లక్ష్యంగా బందరు కేంద్రంగా కొత్తగా ఏర్పడే జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలనుకుంటున్నారు జగన్. దాంతో తామే ఎన్టీఆర్ కి నిజమైన గౌరవం ఇచ్చామని చెప్పాలనుకుంటున్నారు జగన్.

మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ ని ఏపీ టూరిజం ఎంబాసిడర్ అని, మద్యపానం నిషేదానికి ఎంబాసిడర్ అని ప్రచారం చేసినా.. అదేమీ లేదని వైసీపీ నేతలు తేల్చేశారు. అయితే జూ.ఎన్టీఆర్ ని ఏదో రూపంలో ఏపీ ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసి ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. కొంతకాలంగా టీడీపీకి దూరంగా ఉంటున్నకల్యాణ్ రామ్, జూ.ఎన్టీఆర్ లను జాగ్రత్తగా ఒడిసి పట్టుకొని టీడీపీకి షాక్ ఇవ్వాలన్నది జగన్ స్కెచ్ గా రాజకీయ వర్గాల్లో చర్చసాగుతోంది.