చిరు బర్త్‌డే సెలబ్రేషన్స్‌కు ఆపార్టీ నేత చీఫ్ గెస్ట్‌గా రాబోతున్నారా?

మెగాస్టార్ చిరంజీవి మరోసారి రాజకీయాల్లోకి వస్తున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. అయితే మా హీరోను ఇప్పటికైనా వదిలేయండి అంటూ ఫ్యాన్స్ కూడా మరోపక్క గగ్గోలు పెడుతూనే ఉన్నారు. ఇదిలాఉంటే సోషల్ మీడియాలో మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సర్క్యులేట్ అవుతోంది. ఈ నెల 21న చిరు పుట్టినరోజు వేడుకలకు ప్రముఖ బీజేపీ నేత ఒకరు ప్రత్యేక అతిధిగా రాబోతున్నారని ఆ వార్త సారాంశం. అసలు విషయం ఏమిటంటే..ప్రజారాజ్యం పార్టీ స్ధాపించిన అనతికాలంలోనే ఒకేసారి 18 మంది ఎమ్మెల్యేలను […]

చిరు బర్త్‌డే సెలబ్రేషన్స్‌కు ఆపార్టీ నేత చీఫ్ గెస్ట్‌గా రాబోతున్నారా?
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 02, 2019 | 7:21 AM

మెగాస్టార్ చిరంజీవి మరోసారి రాజకీయాల్లోకి వస్తున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. అయితే మా హీరోను ఇప్పటికైనా వదిలేయండి అంటూ ఫ్యాన్స్ కూడా మరోపక్క గగ్గోలు పెడుతూనే ఉన్నారు. ఇదిలాఉంటే సోషల్ మీడియాలో మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సర్క్యులేట్ అవుతోంది. ఈ నెల 21న చిరు పుట్టినరోజు వేడుకలకు ప్రముఖ బీజేపీ నేత ఒకరు ప్రత్యేక అతిధిగా రాబోతున్నారని ఆ వార్త సారాంశం.

అసలు విషయం ఏమిటంటే..ప్రజారాజ్యం పార్టీ స్ధాపించిన అనతికాలంలోనే ఒకేసారి 18 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారు చిరంజీవి. ఆతర్వాత పార్టీని కాంగ్రెస్‌లో విలీనంచేసి ఏకంగా కేంద్ర పర్యాటక శాఖామంత్రిగా కూడా సేవలందించారు. అయితే సైరా మూవీ షూటింగ్ నేపథ్యంలో ఆయన కొంత కాలంగా పాలిటిక్స్‌కు దూరంగా ఉంటున్నారు. అయితే ఏపీ రాజకీయాల్లో కొత్తగా దూసుకొచ్చిన పవన్‌కళ్యాణ్ జనసేనకు నేరుగా చిరంజీవి మద్దతు పలికిన దాఖలాలు ఎక్కడా లేవు. అయితే పవన్ 2014 ఎన్నికల్లో బీజేపీతో చాల సన్నిహితంగా మెలిగారు. 2019 ఎన్నికల నాటికి దూరమయ్యారు.

ఇదిలా ఉంటే చిరంజీవి కూడా బీజేపీలో వెళ్తున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి ఊతమిచ్చేలా రాబోయే చిరు బర్త్‌డే ఫంక్షన్‌లో బీజేపీ ఫైర్‌బ్రాండ్‌గా పేరున్న సోమువీర్రాజు ప్రత్యేక అతిథిగా విచ్చేస్తున్నారని వార్తలు గుప్పుమంటున్నాయి. ఇందులో ఎంత నిజముంతో తెలియదు గానీ.. రాజకీయ వర్గాల్లో మాత్రం చర్చనీయంశంగా మారింది. మరి చిరంజీవి మరోసారి రాజకీయాల్లోకి రానున్నారా? లేక ఇవన్నీ ఊహజనితమేనా? అన్నది రాబోయే రోజుల్లో తేలిపోనుంది.