ఈ “జంప్” దేనికి సంకేతం.. ఉమా..?

మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత బొండా ఉమామహేశ్వరరావు విదేశీ పర్యటనల్లో ఉన్నారు. కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న ఆయన పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఆయన చేసిన ఓ ట్వీట్‌తో టీడీపీ నేతల్లోనే కాదు.. రాజకీయ వర్గాల్లోనూ చర్చ ప్రారంభమైంది. విదేశాల్లో ఆయన చేసిన బంగీ జంప్ దృశ్యాలను ఆ ట్వీట్‌కు జోడించారు. దీంతో ఆయన పార్టీ మారడం ఖాయమని.. వైసీపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. సాధారణ ఎన్నికల్లో విజయవాడ మధ్య నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున […]

ఈ జంప్ దేనికి సంకేతం.. ఉమా..?
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 02, 2019 | 11:30 AM

మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత బొండా ఉమామహేశ్వరరావు విదేశీ పర్యటనల్లో ఉన్నారు. కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న ఆయన పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఆయన చేసిన ఓ ట్వీట్‌తో టీడీపీ నేతల్లోనే కాదు.. రాజకీయ వర్గాల్లోనూ చర్చ ప్రారంభమైంది. విదేశాల్లో ఆయన చేసిన బంగీ జంప్ దృశ్యాలను ఆ ట్వీట్‌కు జోడించారు. దీంతో ఆయన పార్టీ మారడం ఖాయమని.. వైసీపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. సాధారణ ఎన్నికల్లో విజయవాడ మధ్య నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన బొండా ఉమామహేశ్వరరావు కేవలం 25 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక వైసీపీ తరపున పోటీ చేసిన మల్లాది విష్ణు ఈ స్థానం నుంచి అతి తక్కువ ఆధిక్యతతో గెలిచారు. దీనిపై బొండా ఉమా పోరాడినా ప్రయోజనం లేకుండా పోయింది. రీకౌంటింగ్‌ డిమాండ్‌ చేసినా ఎన్నికల అధికారి అనుమతించలేదు. కోర్టులో పిటిషన్ వేసినప్పటికీ దాన్ని కొట్టివేశారు. దీంతో ఆయన కాస్త అసంతృప్తికి గురయ్యారు. ఆ తరువాత మధ్య నియోజకవర్గంలో ఎక్కువగా భూముల ఆక్రమణపై వివాదాలు చెలరేగాయి. మరోవైపు ఆయన రాకను ప్రస్తుత ఎమ్మెల్యే మల్లాది విష్ణు వ్యతిరేకిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.